ఎమ్మెల్యే ఆర్కే వార్నింగ్: చంద్రబాబు నివాసం ఖాళీ చేయిస్తాం: లోకేశ్ ఎదరుపడగానే ఇలా..!
Recommended Video
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు ఉంటున్న నివాసం ఖాళీ చేయిస్తామని తేల్చి చెప్పారు. ఆయన నివాసం అక్రమమని స్పష్టం చేసారు. ఇదే సమయంలో తన మీద మంగళగిరి నుండి పోటీ చేసిన చంద్రబాబు తనయుడు లోకేశ్..ఆర్కే ఇద్దరూ అసెంబ్లీ లాబీల్లో ఎదురుపడ్డారు. ఆ సమయంలో చోటు చేసుకున్న సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షించింది. లోకేశ్ ఏం చెప్పారు..ఆర్కే ఏం సమాధానం ఇచ్చారు...
ఆర్కే..లోకేశ్ ఒకరికితో మరొకరు..
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి..మాజీ మంత్రి..చంద్రబాబు తనయుడు లోకేశ్ మధ్య ఆసక్తి కర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ లాబీల్లో లోకేశ్ వచ్చిన సమయంలోనే అటుగా ఎమ్మెల్యే ఆర్కే వచ్చారు. ఇంతలో లోకేశ్ చొరవ తీసుకొని ఆర్కేకు అభినందనలు తెలిపారు. తనను అభినందించిన లోకేశ్‌కు ఆర్కే ధన్యవాదాలు తెలిపారు. లోకేశ్ ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి అయిన వెంటనే వైసీపీ అసెంబ్లీ బాయ్‌కాట్ చేసింది.

ఇక, తాజా ఎన్నికల్లో వీరిద్దరూ మంగళగిరి నుండి పోటీ చేసారు. ఆర్కేకు మద్దతుగా జగన్..షర్మిళ..మోహన్‌బాబు వంటి వారు ప్రచారం చేసారు. అదే సమయంలో లోకేశ్ గెలుపును టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పోలింగ్ నాటి సాయంత్రం లోకేశ్ పోలింగ్ బూత్ వద్దకు వచ్చి ధర్నా చేసారు. ఇద్దరి గెలుపు మీద రాష్ట్ర వ్యాప్తంగా అసక్తి పెంచింది. అయితే, చివరకు లోకేశ్ పైన ఆర్కే గెలుపొందారు. ఆ తరువాత ఇద్దరు కలుసుకోవటం ఇదే తొలిసారి.
చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయిస్తాం..
తనయుడు లోకేశ్‌తో కరచాలనం చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రం హెచ్చరిక చేసారు. కృష్ణా కరకట్ట మీద ఉన్న అక్రమ నిర్మాణాల పైన పోరాటం కొనసాగిస్తానని ఆర్కే స్పష్టం చేసారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉంటున్న నివాసం సైతం అక్రమ కట్టడమేనని తేల్చి చెప్పారు. చంద్రబాబు సైతం ఆ ఇంటిని ఖాళీ చేసే వరకూ వదలి బెట్టబోమని ప్రకటించారు.
రాజధాని అమరావతిలో ఇల్లు లేని చంద్రబాబు.. అమరావతి మీద ప్రేమ ఉన్నట్లు మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. జగన్ తాడేపల్లిలో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారని గుర్తుచేశారు. రాజధానిలో సొంత ఇల్లు లేని చంద్రబాబుకు జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.ఇదే సమయం లో తనకు నామినేటెడ్ పదవి ఇవ్వటం పైన ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేసారు. సీఆర్‌డీఏ పరిధిలో జరుగుతున్న పనులు ఎందుకు ఆపారో ఆ కాంట్రాక్టర్లనే అడగాలని ఆర్కే కోరారు.












Click it and Unblock the Notifications