వైసీపీకి షాక్.. పార్టీకు గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే
సార్వత్రిక ఎన్నికల ముందు అధికార వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కర్నూల్ జిల్లా, నందికొట్కూరు ఎమ్మెల్యే వైసీపీకి రాజీనామా చేశారు.వైఎస్ షర్మిల సమక్షంలో ఆర్థర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆర్థర్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు షర్మిల. నందికొట్కూరు ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతోనే ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ..ఐప్యాక్ సర్వేలో తనకే ఎక్కువ శాతం అనుకూలంగా రిజల్ట్ వచ్చిందని అయిన తనకు టికెట్ ఇవ్వడానికి జగన్ నిరాకరించారని ఆయన తెలిపారు.
నందికొట్కూరులో ఎప్పటి నుంచో ఇంఛార్జ్ పెత్తనం కొనసాగుతూనే ఉందన్నారు. నందికొట్కూరు టికెట్ ఇస్తాం కానీ.. పాలన బాధ్యతలు వేరేవారికి అప్పగిస్తామని నియోజకవర్గ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి మాటలు విని తాను షాకయ్యానన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనకు ఎలాంటి అధికారులు లేకుండా చేశారని ఆర్థర్ చెప్పుకొచ్చారు. వైసీపీలో ఇమడలేకనే బయటకు వచ్చినట్టు ఎమ్మెల్యే తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుందని.. అందుకే తనకు వేరే పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే చేరానని ఆర్థర్ చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆర్థర్‌కు నందికొట్కూరు నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున నందికొట్కూరు నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కీలక నేతగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆర్థర్ గెలుపుకు కృషి చేసిన బైరెడ్డే.. ఇప్పుడు ఆయనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆర్థర్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గాల మధ్య అధిపత్యపోరు తలెత్తింది. పార్టీ అధిష్టానం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వర్గానికే మద్దతుగా నిలవడంతో ఎమ్మెల్యే ఆర్థర్ నియోజకవర్గంలో ఒంటరయ్యారు. ఇదే సమయంలో ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్థాపం చెందిన ఆర్థర్ వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications