చంద్రబాబు..పవన్ పై పచ్చి బూతులు: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అసభ్యంగా: బహిరంగంగా..!
తానొక ఎమ్మెల్యే అనే విషయం మర్చిపోయారు. ప్రజల మధ్య మాట్లాడుతున్నానే ఆలోచన విస్మరించారు. సభ్యత మరిచారు. అధికార పార్టీలో ఉన్నాననే అహంతో అసభ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు..జనసేన అదినేత పవన్ పైన బూతులతో విరుచుకుపడ్డారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఇప్పుడు ఆ ఇద్దరు నేతల మధ్య చేసిన వ్యాఖ్యలు..అసభ్య పదజాలం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లోనే కాదు.. సాధారణ ప్రజానీకంలోనూ చర్చకు కారణమైంది.
చంద్రబాబును ....కొడకా..వెధవ కాన అని తిట్టాలని ఉంది...కొట్టాలని ఉంది అంటూ చెలరేగిపోయారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అంటూనే.. పవన్ ఒక...కొడుకు అంటూ..లోకేశ్ కొవ్వు కరిగించాలంటూ దూషించారు. ఆయన మాట్లాడిన వ్యాఖ్యల వీడియో హల్ చల్ చేస్తోంది.
బూతులతో వైసీపీ ఎమ్మెల్యే సంచలనం..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. మాజీ మంత్రి నారా లోకేష్.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పచ్చి బూతులతో వారిని అసభ్యంగా దూషించారు. చంద్రబాబు తన బినామీల కోసం బస్సు యాత్ర చేపడుతున్నారంటూ మండిపడ్డారు.
చంద్రబాబుని ల... కొడకా..వెధవ కన అని తిట్టాలని ఉంది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మొన్న ఎన్నికల్లో చంద్రబాబు కి సరైన బుద్ధి చెప్పామని..ఆ ముసలాడు మళ్లీ లేవకూడదు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా పని చేయాలంటూ పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన వెధవ పనులన్నీ ప్రజలకు తెలియజెప్పాలని సూచించారు. చంద్రబాబు కొడుకు పప్పు లోకేష్ కూడా కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్....
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన అదే రకంగా ద్వారంపూడి విరుచుకుపడ్డారు. చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే నువ్వు కూడా ఒక నాయకుడివేనా అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఒక దొంగ..... అంటూ దూషణలకు దిగారు. ల... చేసే పనులన్నీ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడంటూ అసభ్య పదజాలం ప్రయోగించారు.
అసలు రాజధానిని వెంటనే విశాఖకు తరలించాలని డిమాండ్ చేసారు. అమరావతి లో బినామి ను బయటకు తేవాలిని ముఖ్యమంత్రిని కోరతున్నానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను జైల్లో వేయాలంటూ డిమాండ్ చేసారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications