సీఎం చెబితేనే వస్తారా - వైసీపీ ఎమ్మెల్యేకు షాక్ : సొంత నియోజకవర్గంలోనే..!!
వచ్చే రెండేళ్ల పాటు ప్రతీ ఎమ్మెల్యే ప్రజలతోనే ఉండాలి. ప్రతీ ఇంటికి రెండు మాడు సార్లు వెళ్లాలి అంటూ..పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ నిర్దేశించారు. సీఎం ఆదేశాలో ఎమ్మెల్యేలు ప్రజల బాట పట్టారు. అయితే, సీఎం చెబితేనే మీరు వస్తారా అంటూ ఎమ్మెల్యేలను నిదీస్తున్న అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇటువంటి చేదు అనుభవం ఎదురైంది. ఆయన తన నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లారు. అక్కడి మహిళలను సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ఆరా తీసారు.

సంక్షేమం ఓకే - స్థానిక అంశాలు
వాటి నుంచి ఎక్కడా మహిళలు వ్యతిరేకంగా చెప్పలేదు. కానీ, స్థానికంగా తమ సమస్యల పైన మాత్రం ఎమ్మెల్యేలను నిలదీసారు. పధకాలు సరే.. తాగటానికి ముందు నీళ్లివ్వండి అంటూ స్థానిక మహిళలు ఎమ్మెల్యేను డిమాండ్ చేసారు. సీఎం జగన్ చెబితే ఇప్పుడు వచ్చారా అంటూ మహిళలు నిలదీసారు. ఇప్పుడు ఎమ్మెల్యే వస్తున్నారనే సమచారంతో నీళ్ల ట్యాంకర్లు ఈ రోజు వచ్చాయని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసారు. పారిశుద్ద్య సమస్యల పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో..ఒక్క సారిగా స్థానికులు సమస్యలు ఏకరువు పెట్టటంతో ఎమ్మెల్యే షాక్ అయ్యారు. వీటిని ఖచ్చింగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

పరిష్కరించే మళ్లీ వస్తానంటూ
వీటిని పరిష్కరించిన తరువాతనే మరలా ఇక్కడకు వస్తానంటూ ఎమ్మెల్యే వెళ్లిపోయారు. అయితే, సీఎం చెబితేనే ఎమ్మెల్యే వచ్చారంటూ.. ఎమ్మెల్యే వస్తుంటేనే అధికారులు వచ్చారంటూ స్థానిక మహిళలు నేరుగా ఎమ్మెల్యే ముందే చెప్పుకొచ్చారు. ఇక, వేసవి మొదలు అయిన పరిస్థితుల్లో అనేక నియోజకవర్గాల్లో మంచి నీటి సమస్యలే ప్రధానంగా ఎమ్మెల్యేల ముందుకు వచ్చే అవకాశం ఉంది. శాసనసభా సమావేశాలు ముగిసిన తరువాత ప్రజల్లోకి వెళ్లాల్సిందేనని ఎమ్మెల్యేకు సీఎం స్పష్టం చేసారు. దీంతో..వరుసగా రెండు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రతాప్ కుమార్ రెడ్డి సైతం స్థానికుల సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Recommended Video


ఎమ్మెల్యేలు ఎదుర్కోవాల్సిందే
ఇక, ఎమ్మెల్యేలు మరింతగా ప్రజల్లోకి వస్తే..ఎన్నో సమస్యలు వారిని చుట్టుముట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలులో సీఎం పైన సానుకూలంగా ఉన్నా..స్థానిక సమస్యల పైన మాత్రం నియోజకవర్గాల్లో ప్రజలు ఎమ్మెల్యేలను ప్రశ్నించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశాలు అసెంబ్లీ లాబీల్లోనూ ఎమ్మెల్యేల మధ్య చర్చకు కారణమయ్యాయి. అయితే, వీటిని ఎంతో కొంత పరిష్కరించుకుంటేనే వచ్చే ఎన్నికల నాటికి సానుకూలత ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే, సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్లు ఇస్తానని..ఇందులో ఎటువంటి మొహమాటం లేదని సీఎం స్పష్టం చేయటంతో ఇక, ఎమ్మెల్యేలు ప్రజల ముందుకు వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు.












Click it and Unblock the Notifications