మీ కథ తేలుస్తా, చెప్పులతో కొట్టిస్తా: రెచ్చిపోయిన జగన్ పార్టీ ఎమ్మెల్యే

కడప: వ్యవసాయ శాఖ అధికారులపై కడప జిల్లా మైదుకూరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు ఎస్. రఘురామిరెడ్డి రెచ్చిపోయారు. వ్యవసాయశాఖలో ఉన్నతస్థాయి అధికారి నుంచి క్షేత్రస్థాయి వరకు అంతా మోసమేనని, ఏ ఒక్క అధికారి కూడా నీతినిజాయితీగా వ్యవహరించడని ఆయన అన్నారు.

దాంతో ఆగకుండా... మీ కథ తేలుస్తా, చెప్పులతో కొట్టిస్తా, ఊళ్లోకి రానివ్వకుండా చేస్తానని తమను దూషించారని వ్యవసాయాధికారులు ఆరోపించారు. ఈ మేరకు స్థానిక వ్యవసాయశాఖ సంచాలకుడు వెంకటసుబ్బయ్య, మండల వ్యవసాయాధికారి లక్ష్మణ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు మైదుకూరులోని అంకాలమ్మ ఆలయం ఆవరణలో సోమవారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించేందుకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను అధికారులు ఆహ్వానించారు.

YCP MLA Raghurami Reddy warns officials

మొదట సుధాకర్‌ యాదవ్‌ కార్యక్రమంలో పాలుపంచుకుని వెళ్లిన తర్వాత రఘురామిరెడ్డి వచ్చారు. అధికారులు ఆయన్ను స్వాగతించి తాము ఏర్పాటు చేసిన స్టాళ్లను చూపించి, వేదికపైకి పిలిచారు. అయితే వేదికపైకి రాగానే, ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరినీ ఎమ్మెల్యే దూషించారని ఫిర్యాదు చేశారు.

తిరిగి వీడ్కోలు పలికేందుకు కారు వద్దకు వెళ్లగా ప్రొటోకాల్‌ పాటించలేదంటూ తనను, ఏడీఏని ...కొడకా అంటూ అసభ్యంగా దూషించి.. తిట్ల దండకం చదివి వెళ్లిపోయారని, ఇందుకు ఏడీఏతో పాటు చాపాడు, ఖాజీపేట, దువ్వూరు, బి.మఠం వ్యవసాయాధికారులు సురేష్ కుమార్‌, జీపీ ఓబులేసు, ప్రవీణ్‌కుమార్‌, మల్లికార్జున ఇతర సిబ్బంది సాక్షులని లక్ష్మణ్‌కుమార్‌ తన ఫిర్యాదులో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+