సభ తప్పు చేసింది, దిద్దుకోవాల్సింది సభనే: రోజా సస్పెన్షన్‌పై ఇందిరా జైసింగ్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పీల్‌పై ఉమ్మడి హైకోర్టుపై సోమవారం వాదనలు ముగిశాయి. హైకోర్టును తీర్పు మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శితో ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేయించింది.

ఈ పిటిషన్‌పై ప్రభుత్వం తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రావు తన వాదనలు వినిపించారు. రోజా తరుపున ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. 'ఈ కేసులో కక్షిదారు అసెంబ్లీ మాత్రమే. కానీ ఇక్కవ అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్‌కు వచ్చారు. సభ చేసిన అప్పీల్ మాత్రమే ఇక్కడ వర్తిస్తుంది. అసెంబ్లీ అప్పీల్‌కు రాలేదు కాబట్టి, మధ్యంతర ఉత్తర్వులు అమలుకు అభ్యంతరం లేదనే అర్థం చేసుకోవాలి. అసెంబ్లీ ఉద్యోగులు ఒక పక్షం వహించరు.

అధికారపక్షం, ప్రతిపక్షం రెండూ అసెంబ్లీ ఉద్యోగులకు సమానమే. అలాంటప్పుడు వారు ఎలా అప్పీల్‌కు వస్తారు. అసెంబ్లీ కార్యదర్శి ఈ కేసులో రెండో రెస్పాండెంట్. 340 నిబంధన కిందే ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ విధించారు. రోజాను సస్పెండ్ చేసింది సభ కాబట్టి. ఇప్పుడు దాన్ని తొలగించాల్సింది కూడా సభేనని' అసెంబ్లీ నిబంధనలను జైసింగ్ ఈ సందర్భంగా చదివి వినిపించారు.

అలా కాకుండా రూల్ 194 కింద చర్య తీసుకుంటే ముందుగా నోటీసు ఎందుకు ఇవ్వలేదని ఇందిరా జైసింగ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి, రోజా లాయర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. రూల్ 340 కిందే ఎమ్మెల్యే రోజాపై చర్య తీసుకున్నారని స్పష్టమవుతుందని అన్నారు.

 ycp mla roja suspension case high court to announce verdict tuesday

దీనిని బట్టి చూస్తుంటే సభ పొరపాటు చేసిందని, ప్రభుత్వం వచ్చి కోర్టుకు చెబుతోందని, ఆ పొరపాటును సభే సరిదిద్దుకోవాలని రోజా తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ తన వాదనలు గట్టిగా వినిపించారు. మరోవైపు ప్రభుత్వం తరుపున రావు తన వాదనలు వినిపించారు.

అసెంబ్లీలో రోజా చేసిన అసభ్య పదజాలం, సీఎంపై కూడా కామ చంద్రబాబు, కాల్‌మనీ చంద్రబాబు అంటూ అసభ్యంగా మాట్లాడడం, దళిత ఎమ్మెల్యేలపై కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు, స్పీకర్‌ చైర్‌ను గౌరవించకపోవడం తదితర అంశాలను న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు.

రూల్ 340, 194లో టెక్నికాలిటీ సమస్య వచ్చిందని, ఆ సమస్యను సభ సరిదిద్దుకునే హక్కు ఉందని వ్యాఖ్యానించారు. ఇరువైపుల నుంచి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+