వైసీపీలో ఇద్దరు కొత్త రెబల్స్ - సభకు దూరం : పార్టీ ఫ్లెక్సీల తొలిగింపు..!!
ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆ ఇద్దరు సంచలనంగా మారారు. టీడీపీ అభ్యర్దికి ఓటు వేసిన ఇద్దరు వైసీపీ కొత్త రెబల్స్ అసెంబ్లీకి హాజరు కాలేదు. వైసీపీ నాయకత్వం కూడా ఆ ఇద్దరినీ గుర్తించింది. అధికారికంగా మాత్రం వెల్లడించ లేదు. వైసీపీ నుంచి నాలుగు ఓట్లు టీడీపీకి పోలయ్యాయి. అందులో ఆనం - కోటంరెడ్డి పైన ముందు నుంచి ఊహించిందే. మిగిలిన ఇద్దరిలో ఎమ్మెల్యేలు మేకపాటి .. ఉండవల్లి శ్రీదేవి టీడీపీకి ఓటు వేసారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో మేకపాటి కార్యాలయంలో వైసీపీ ఫ్లెక్సీలను కూడా తొలిగించారు. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ తో టీడీపీ అభ్యర్ధి విజయం సాధించారు. నలుగురిలో ఇద్దరి పేర్లు ఇవే అని ప్రచారం సాగుతున్నా..అధికారికంగా ఖరారు కాలేదు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముందే ఉండవల్లి శ్రీదేవి తన కుమార్తెతో పాటుగా సీఎం జగన్ ను కలిసారు. ఆ సమయంలో సొంత అన్నలా చూసుకుంటానంటూ జగన్ హామీ ఇచ్చారు. ఆ తరువాత పోలింగ్ కు వెళ్లారు. అదే విధంగా ఎన్నికల్లో ఓటు వేసిన తరువాత మేకపాటి చంద్రశేఖర రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలోనే సీఎం జగన్ ను కలిసారు. ఆ తరువాత అక్కడ నుంచి బెంగుళూరు వెళ్లిపోయారు. ఫోన్ లోనూ అందుబాటులో లేరు. ఉదయగిరి లో ఆయన పార్టీ కార్యాలయంలో వైసీపీ ఫ్లెక్సీలు తొలిగించారు.

తన పైన జరుగుతున్న ప్రచారాన్ని ఉండవల్లి శ్రీదేవి ఖండించారు. తనకు క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇక..మేకపాటి అనుచరులు మాత్రం ప్రస్తుతం తమ ఎమ్మెల్యే బెంగుళూరు లో ఉన్నారని చెబుతున్నారు. ఉదయగిరిలో వచ్చే ఎన్నికల్లో సీటు పైన సీఎం నుంచి హామీ లేదనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కానీ, జగన్ పార్టీ ప్రకటించిన సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చిన చంద్రశేఖర రెడ్డి..ఇప్పుడు టీడీపీకి మద్దతుగా ఓటు వేయరని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆటు ఆనం కూడా తాను వైసీపీలో ఎమ్మెల్సీకే మద్దతుగా ఓటు వేసానని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో..పోలింగ్ కు ముందే కోడింగ్ డిసైడ్ చేసిన వైసీపీ నాయకత్వం..ఇప్పటికే ఆ నలుగురు ప్రత్యేకంగా ఇద్దరు కొత్త రెబల్స్ ఎవరనేది గుర్తించింది. కానీ, బయటకు చెప్పటం లేదు.

ఇప్పటి వరకు ఆనం -కోటంరెడ్డి మాత్రమే వైసీపీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీకి దగ్గరైన ఎమ్మెల్యేలుగా గుర్తించారు. ఇప్పుడు మరో ఇద్దరు ఆ జాబితాలో చేరారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కవనే కారణంతోనే కొత్తగా ఇద్దరు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారనే చర్చ సాగుతోంది. వైసీపీకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలోనే వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వైసీపీకీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ నలుగురి పైన పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మరో ఆసక్తి కర మొదలైంది. సీక్రేట్ ఓటింగ్ జరిగినా.. ఆ నలుగురి ఎవరనేది వైసీపీ నాయకత్వానికి క్లారిటీ ఉంది. దీంతో.. ఇప్పుడు మౌనం పాటిస్తున్న వైసీపీ ..ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది చూడాలి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications