వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జడ్జీ నివాసానికి ఎమ్మెల్సీ అనంతబాబు.. బ్లాక్ మెయిల్ చేశాడట.. కొట్టడంతోనే మృతి..?

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు సంచలనం రేకెత్తించింది. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ చేసి.. రహస్య ప్రదేశంలో విచారించారు. అనంత భాస్కర్ పోలీసుల కస్టడీలో ఉన్నారని కాకినాడ ఏఎస్పీ వెల్లడించారు. విచారణలో సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్టు ఎమ్మెల్సీ ఒప్పుకున్నారని తెలిసింది. తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నందుకే హత్య చేశానని తెలిపినట్టు సమాచారం.

బ్లాక్ మెయిల్ చేశాడట..

బ్లాక్ మెయిల్ చేశాడట..


తనను బ్లాక్ మెయిల్ చేశాడని పేర్కొన్నారు. బెదిరిద్దామని అనుకున్నానని, కొట్టి బెదిరిద్దాం అని భావించానని చెప్పారు. ఆవేశంతో కొడితే చనిపోయాడని తెలిపారు.
కాసేపట్లో ఆయనను జడ్జీ జానకి ఎదుట హాజరు పరుస్తారు. కోర్టు సమయం ముగియడంతో జడ్జీ ముందు ప్రవేశపెట్టనున్నారు. జడ్జీ ఆయనకు రిమాండ్ విధించే అవశాశం ఉంది. ప్రస్తుతం ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీని ఆసుపత్రికి తరలించారు.

 మండలి చైర్మన్, అసెంబ్లీ సెక్రటరీకి సమాచారం

మండలి చైర్మన్, అసెంబ్లీ సెక్రటరీకి సమాచారం


అనంతబాబు అరెస్ట్‌కు సంబంధించి ఇప్పటికే మండలి చైర్మన్‌తోపాటు అసెంబ్లీ సెక్రటరీకి సమాచారం అందజేశారు. ఎస్పీ ఆఫీస్‌ నుంచి అనంతబాబును జడ్జీ నివాసానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వైద్య పరీక్షల తర్వాత మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చనున్నారు. భారీ బందోబస్తు మధ్య అనంతబాబును పోలీసులు తరలిస్తున్నారు. మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తాను చంపినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

 హత్యే

హత్యే


వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు గురయిన సంగతి తెలిసిందే. కాకినాడకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు అలియాస్ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యగా తేలింది. సుబ్రమణ్యం మర్మాంగాలపై బలంగా కొట్టడంతో మృతి చెందాడని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడైంది. సుబ్రహ్మణ్యం శరీరంపై గాయాలు ఉన్నాయని నిర్ధారించారు. సుబ్రహ్మణ్యం ఎడమ చేయి, ఎడమకాలు బొటనవేలు, తలపై తీవ్ర గాయాలు కనిపించాయి.

English summary
ycp mlc anantha babu move to judge house. he is agree to subramanyam murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X