వైసీపీ మహిళా ఎమ్మెల్సీ హఠాన్మరణం - ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి ..!!
ఏపీ శాసనమండలి సభ్యురాలు ఎండీ కరీమున్నిసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా శుక్రవారం సైతం మండలి సమావేశానికి హాజరయ్యారు. ఆ తరువాత ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. వారం రోజులుగా స్వల్ప అస్వస్థతతో ఉన్న ఆమెకు శుక్రవారంరాత్రి గుండెలో నొప్పి రావడంతో తనయుడు రుహుల్లా హుటాహుటిన అస్పత్రికి తరలించారు.

సిట్టింగ్ ఎమ్మెల్సీ కన్నుమూత
అస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే ఆమె తుదిశ్వాస విడిచారు. భౌతిక కాయాన్ని అస్పత్రి నుంచి ఇంటికి తరిలించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీకోసం నిరంతరం శ్రమించారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఆమె సీఎం జగన్, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కలిశారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా గారి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఉదయం సమావేశాలకు హాజరై..రాత్రికి తుది శ్వాస
శుక్రవారం ఉదయం శాసన మండలి సమావేశాలకు హాజరైన ఆమె రాత్రి అస్వస్థతకు గురి కావడం, గుండె పోటుతో మరణించడం పట్ల ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. విజయవాడలో ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ప్రతిభావంతమైన నాయకురాలిగా, కార్పొరేటర్ నుంచి మండలి సభ్యురాలిగా ఎదిగిన కరీమున్నీసా మరణం ఊహించనిదని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Recommended Video

ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి
అసెంబ్లీలో సైతం జగన్ తమ ప్రభుత్వం మహిళా సాధికారిత చర్చలో భాగంగా ఇద్దరు మైనార్టీ మహిళలకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలమని చెప్పుకొచ్చారు. అందులో కరీమున్సీసా ఒకరు. అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న కరీమున్నీసా పార్టీ పట్ల విధేయతతో ఉండేవారు. ఎమ్మెల్సీ కరీమున్సీసా మరణం తెలుసుకున్న జిల్లాకు చెందిన మంత్రులు... పలువురు ప్రజా ప్రతినిధులు నివాళి అర్పించారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications