విజయసాయిరెడ్డి కొత్త ట్విస్ట్: కియో కుంభకోణం త్వరలో బయటకు: దొంగ ఏడుపులు వద్దు..!
టీడీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం చేసుకున్న కియో మోటార్స్ గురించి వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. కియా కార్ల పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల అద్దే విషయంలో జరిపిన అవినీతిని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ట్విటర్ వేదికగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
కియో పుట్ట త్వరలోనే పగులుతుంది..
అనంతపురం జిల్లాలో కియో కార్ల పరిశ్రమ గురించి టీడీపీ ప్రభుత్వం చాలా గొప్పగా ప్రచారం చేసుకుంది. ఇది తమ ఘనత అని..కరువుసీమలో ఉద్యోగాలు సృష్టించామని చెప్పుకొచ్చారు. అయితే, టీడీపీకి మద్దతుగా నిలిచే మీడియాలో ఈ మధ్య కాలంలో కియో సంస్థ గురంచి కొన్ని కధనాలు వచ్చాయి. దీని పైన వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ట్వీట్ చేసారు. కియా కార్ల పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుందని హెచ్చరించారు. కియా కార్ల కంపెనీతో ఇంటికో ఉద్యోగం వస్తుందని ఊదరగొట్టిన మీడియా ఇప్పుడు కొత్త రాగం అందుకుందని, అక్కడ అంతా తమిళులే, ప్రాజెక్టు అభివృద్ధి జరగలేదని ఏడుపు లంకించుకున్నాయన్నారు. దొంగ ఏడుపులు వద్దని, యువ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఏం చేయాలో తెలుసని, కియా పేరిట జరిగిన భూకుంభకోణం పుట్ట త్వరలోనే పగులుతుంద ని హెచ్చరించారు.

అద్దె చెల్లింపుల్లోనూ ఇదే రకంగా..
ఆఫీసుల అద్దె చెల్లింపుల్లోనూ చంద్రబాబు ప్రబుత్వం అవినీతికి పాల్పడిందని సాయిరెడ్డి మరో ట్వీట్ చేసారు. విజయవాడలోని నక్కల రోడ్డులోని పంచాయతీ రాజ్..గ్రామీణాభివృద్ది శాఖ కార్యాలయానికి అయిదు లక్షల లోపే అద్దె చెల్లించేవారని సాయిరెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ కార్యాలయాన్ని 30 లక్షల అద్దె బిల్డింగ్‌లోని షిఫ్ట్ చేసారని.. ప్రజల సొమ్ము అంటే అంత చులకనా బాబు అని సాయిరెడ్డి ట్వీట్‌లో ప్రశ్నించారు.
వైసీపీ అధికారంలోకి రాకముందు ట్వీట్‌ల ద్వారా టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ నిర్ణయాల గురించి ట్వీట్ల ద్వారానే వివిరిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ అవినీతి అంటూ వాటిని ప్రస్తావిస్తూ జగన్ ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications