వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజ‌య‌సాయిరెడ్డికి ఝ‌ల‌క్‌: ఆయ‌న ఎంపిక చెల్ల‌దు: అధికారం ద‌క్కినా..అప్పుడే..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎన్నిక‌ల్లో గెలిచిన కొద్ది రోజుల‌కే వైసీపీ ముఖ్య నేత విజ‌య సాయిరెడ్డికి ఝ‌ల‌క్. ఒలంపిక్ అసోసియేషన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా.. లేని పదవిని సృష్టించి విజయసాయిరెడ్డిని చైర్మన్ చేయడం దరదృష్టకరమని ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ కె.పిచ్చేశ్వరరావు అన్నారు. నియమ నిబంధ‌న‌ల‌కు వ్యతిరేకంగా చేపట్టిన విజయసాయిరెడ్డి నియామకం చెల్లదని తేల్చి చెప్పారు.

విజ‌య‌సాయిరెడ్డి నియామ‌కం చెల్ల‌దు..
ఏపీ ఒలింపిక్ అసోసియేష‌న్ ఛైర్మ‌న్‌గా వైసీపీ సీనియ‌ర్ నేత రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయిరెడ్డిని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది జ‌రిగిన 24 గంటల్లోగానే దీని పైన వ్య‌తిరేక‌త మొద‌లైంది. ఒలంపిక్ అసోసియేషన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా.. లేని పదవిని సృష్టించి విజయసాయిరెడ్డిని చైర్మన్ చేయడం దరదృష్టకరమని ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ కె.పిచ్చేశ్వరరావు వ్యాఖ్యానించారు.

YCP MP Vijaya Sai Reddy would not be continue as Olympic Association Chairman

ఒలంపిక్ సంఘం రెండు వర్గాలుగా ఏర్పడి అనేక ఒత్తిళ్లకు గురైందన్నారు. ఒలంపిక్ సంఘం ఎన్నికలను గుర్తింపు పొందిన సంఘాలతో నిర్వహించామని, గత ప్రభుత్వంలో గుర్తింపులేని సంఘాలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించారని చెప్పారు. మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలన్న జగన్.. ఒలింపిక్ సంఘంలో జరిగే అవకతవకలను సరిచేయాల్సిందిగా కోరుతున్నాం. ఒలింపిక్ సంఘం ఎన్నికపై న్యాయ పరమైన పోరాటం చేస్తామ‌ని స్ప‌ష్టం చేసారు.

లేని ప‌ద‌వి సాయిరెడ్డికి ఇచ్చారు..
ఒలింపిక్ సంఘం గురించి ఆయ‌న అనేక విష‌యాల‌ను బ‌య‌ట పెట్టారు. ఒలంపిక్ సంఘం సభ్యుడైన పురుషోత్తం 2015లో కొత్త సంఘాన్ని, సొసైటీని ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేయించారని వివ‌రించారు. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ఏపీలో ఉండాల్సి ఉండ‌గా..మద్రాస్ చిరునామాతో ఉందన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు పురుషోత్తం రిజిస్ట్రేషన్ చేయించిన సంఘం గుర్తింపు చెల్లద‌ని... వాస్తవాలు చెప్పకుండా ప్రభుత్వాన్ని గతంలో తప్పుదారి పట్టించారని ఆరోపించారు.

ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని దుయ్య బ‌ట్టారు. నియమ నిబంధనలు పాటించకుండా .. లేని పదవి సృష్టించి విజయసాయిరెడ్డిని చైర్మన్‌గా చేయడం దురదృష్టకరం అన్నారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చేపట్టిన విజయసాయిరెడ్డి నియామకం చెల్లదని స్ప‌స్టం చేసారు. ఒలింపిక్ సంఘం నియమ నిబంధనలు తెలుసుకోవాల్సిందిగా విజయసాయిరెడ్డి ,కృష్ణదాస్‌లను కోరుతున్నామంటూ పిచ్చేశ్వ‌ర రావు విజ్ఞ‌ప్తి చేసారు.

English summary
YCP MP Vijaya Sai Reddy would not be continue as Olympic Association Chairman. After his nominated as Chairman Association secretary differed with this decision and decided to fight in court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X