బీజేపీకి టచ్‌లోకి వెళ్లిన వైసీపీ ఎంపీ..?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ఏపీ రాజకీయ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ పార్టీ సాధించని రితీలో కూటమి ఘన విజయం సాధించింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను కైవవం చేసుకున్న వైసీపీ ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది.
11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి. వైసీపీ ఘోర ఓటమితో ఆ పార్టీలో గెలిచిన ప్రజా ప్రతినిధులు ఎంతమంది ఉంటారా అనుమానం కలుగుతోంది.ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ బీజేపీకి టచ్‌లోకి వెళ్లారనే పుకార్లు మొదలైయ్యాయి. వైసీపీ నుంచి గెలిచిన ఎంపీలలో అవినాష్ రెడ్డి ఒకరు.కడప పార్లమెంట్ స్థానం నుంచి అవినాష్ రెడ్డి విజయం సాధించారు. జగన్ సోదరుడు కావడంతో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే అవకాశాలు లేవు. అలాగే రాజంపేట నుంచి మిథున్ రెడ్డి విజయం సాధించారు. ఆయన జగన్‌కు అత్యంత సన్నిహితుడు .ఆయన పార్టీ మారే అవకాశం లేదు.
ఇక మరో నమ్మకమైన వ్యక్తి తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఆయన కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారరు. ఇక మిగిలింది అరకు ఎంపీ చెట్టి తనూజారాణి గెలిచిన నలుగురు ఎంపీలలో అరకు ఎంపీపైనే మాత్రమే కాస్త అనుమానాలు ఉన్నాయి. వైసీపీ వ్యతిరేక సోషల్ మీడియాలో ఆమె పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె గెలిచిన తర్వాత ఇటీవల జగన్‌ను కలిసి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. దీంతో ఆమె పార్టీ మారరని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. దీనిపై తనూజారాణి క్లారిటీ ఇచ్చే వరకు ఇలాంటి పుకార్లు వస్తునే ఉంటాయి.












Click it and Unblock the Notifications