OBC Reservetion: ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి.. వైసీపీ ఎంపీల డిమాండ్..

చట్ట సభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఏ పార్టీ కూడా ముందుకు రాలేదు. తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా బీసీ రిజర్వేషన్ల డిమాండ్ తెర పైకి వచ్చింది. చట్టసభల్లో ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ కోరారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాగైతే రిజర్వేషన్లు కల్పిస్తున్నారో అదేవిధంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అందులో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

రాజ్యసభలో గురువారం మహిళ బిల్లు పై జరిగిన చర్చలో సుభాష్ చంద్రబోస్ మాట్లాడారు. మహిళా బిల్లు కార్యరూపం దాల్చిన ఏడేళ్ల తర్వాత అమలు చేయడం అంటే పంచభక్ష్య పరమాన్నం ముందుపెట్టి ఎప్పుడో తినమన్నట్లు ఉందని చెప్పారు. సామాజిక, విద్య, ఆర్థిక అంశాల్లో వెనుకబాటు తనంతో ఉన్న ఓబీసీలకు రిజర్వే షన్లు ఎందుకు కల్పించరని బోస్‌ రాజ్యసభలో నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆలోచించి త్వరలోనే ఓబీసీ బిల్లు తీసుకురావాలని కోరారు. మహిళా బిల్లుపై చర్చలో మరో ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడరు.

YCP MPs R Krishnaiah and Subhash Chandra Bose demanded reservation for OBCs in legislatures

మహిళా బిల్లు స్వాగతిస్తున్నామన్న ఆయన దేశంలో లింగ, కుల వివక్షలు ఉన్నాయని చెప్పారు. మహిళ బిల్లుతో లింగ వివక్ష తగ్గుతుందని.. అయితే, కుల వివక్ష తగ్గించాలంటే బిల్లులో ఓబీసీ సబ్‌కోటా పెట్టాలని డిమాండ్ చేశారు. సబ్‌కోటా కుదరకపోతే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని కోరారు. అన్ని రంగాల్లోనూ బీసీల పాత్ర చాలా తక్కువగానే ఉంటోందని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. బీసీల పట్ల కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్‌ ఎప్పుడు కల్పిస్తారని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ప్రశ్నించారు.

కేంద్రం బీసీ జనగణన చేపట్టి.. ఇప్పటికైనా దేశ జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. బేగంపేట హరిత ప్లాజాలో బుధవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. బీసీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఈ సమావేశంలో పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు జూలూరు గౌరి శంకర్‌, బాలరాజ్‌ యాదవ్‌, అనిల్‌ కుర్మాచలం, గోసుల శ్రీనివాస్‌ యాదవ్‌, పిట్టల రవీందర్‌.. బీసీ కమిషన్‌ సభ్యులు కిషోర్‌ గౌడ్‌, శుభప్రద్‌ పటేల్‌, బీఆర్‌ఎ్‌సకు చెందిన పలువురు బీసీ నాయకులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+