ప్రకాశం బ్యారేజ్ బోట్ల ఘటనలో బిగ్ ట్విస్ట్..షాకింగ్ వీడియో లీక్
ఇటీవల విజయవాడలోని కృష్ణ నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వచ్చింది. దీంతో పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తిన అధికారులు ప్రవాహాన్ని సముద్రంలోకి వదిలారు. ఈ సమయంలో వరదలో కొట్టుకొచ్చిన భారీ బోట్లు ప్రకాశం బ్యారేజీ లోని 67, 68, 69 వ గేట్లకు బలంగా ఢీ కొట్టాయి. దీంతో గేట్ల కౌంటర్ వేయిట్ పిల్లర్లు డ్యామేజ్ అయ్యాయి. AP-IV-M-SB-0017, AP-IV-M-SB-0022, AP-IV-M-SB-0023 నెంబర్లు గల బోట్లు.. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. ఈ ఘటనలో బ్యారేజీలోని 67, 69, 70 గేట్లు దెబ్బతిన్నాయి.
దీంతో ఆ గేట్లకు కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బోట్లకు వైసీపీ రంగులు వేసి ఉండటంతో ఇది ఆ పార్టీ నేతల పనే అని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆ మూడు బోట్లు వైసీపీకి చెందిన వారివే అని మంత్రులు సైతం ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంలకు బోట్ల యజమాని ఉషాద్రి రామ్మోహన్ సన్నిహితుడని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకుల వాదన మరోలా ఉంది.ఆ బోట్ల యజమాని...మంత్రి నారా లోకేష్ సన్నిహితుడని వైసీపీ నాయకులు చెబుతున్నారు.

ఈ కేసులో నిందితుడు కోమటి రామ్మోహన్, ఉషాద్రిలను పోలీసులు అరెస్ట్ చేశారని, అందులో రామ్మోహన్...టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం బంధువని ఆరోపిస్తోంది. గతంలో లోకేష్‌తో కలిసి ఉషాద్రి దిగిన ఫొటోలను వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నిందితులకు లోకేష్‌తో సంబంధాలున్నాయనడానికి ఈ ఫొటోలే సాక్ష్యమని చెబుతోంది. వరద బాధితులంతా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, దానిని తప్పుదోవ పట్టించేందుకే టీడీపీ ప్రయత్నిస్తోందని, అందుకే వైసీపీపై నిందలు వేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
🚨 Big Expose Alert! 🚨
— YSR Congress Party (@YSRCParty) September 10, 2024
ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు టీడీపీకి చెందినవేనని మరో సాక్ష్యం వెలుగులోకి
జూన్ నెలలో కూటమి గెలవగానే బోట్ల ర్యాలీతో టీడీపీ నేతలు సంబరాలు
ఆ ర్యాలీలో వినియోగించిన బోట్లే మొన్న ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి
అడ్డంగా దొరికినా ఇంకా సిగ్గులేకుండా… pic.twitter.com/snqtMSm9mx
తాజాగా ఓ బోట్లు టీడీపీ నాయకులకు చెందినవే అనడానికి సాక్ష్యాలను సైతం వైసీపీ బయటపెట్టింది. ఎన్నికల్లో గెలవగానే ఆ బోట్లలోనే టీడీపీ ర్యాలీ చేసిందని వైసీపీ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఎన్నికల్లో గెలవగానే ఆ బోట్లతో ర్యాలీ చేసి టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని, అవే బోట్లు బ్యారేజ్ను ఢీకొన్నాయని తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అడ్డంగా దొరికినా సిగ్గులేకుండా వైసీపీపై నిందలా అని చంద్రబాబును ప్రశ్నించింది. ఇంతకంటే దిక్కుమాలినతనం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications