Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తొలి చూపులోనే ఆమెను ఇష్టపడ్డ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే కూతురుతో పెళ్లి.. ఈ అమ్మాయే!

తెలుగుదేశం పార్టీ నేత, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు రామ్మోహన్ నాయుడు త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు. ఆయన టిడిపి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ చిన్న కూతురు శ్రీ శ్రావ్యను పెళ్లి చేసుకోనున్నారు.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేత, శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు రామ్మోహన్ నాయుడు త్వరలో పెళ్లి చేసుకుంటున్నారు. ఆయన టిడిపి పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి చిన్న కూతురు శ్రీ శ్రావ్యను పెళ్లి చేసుకోనున్నారు.

రామ్మోహన్ నాయుడు - శ్రీశ్రావ్యల పెళ్లి వచ్చే ఏడాది మే లేదా జూన్ నెలలో జరగనుంది. డిసెంబర్ 23వ తేదీన ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేశారని సమాచారం.

బీటెక్ పూర్తి చేసిన శ్రీశ్రావ్య

శ్రీ శ్రావ్య విశాఖపట్నంలోని గాయత్రీ విద్యా పరిషత్ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. భరతనాట్యం బాగా చేస్తారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో గత ఏడాది బీటెక్ పూర్తి చేశారు.

అమెరికాలో చదివిన రామ్మోహన్ నాయుడు.. 2012లో తన తండ్రి ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపీగా ఉన్నారు. పార్లమెంటులో బయట తన ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు.

rammohan naidu

30 ఏళ్లుగా బండారు - కింజారపు ఫ్యామిలీలకు పరిచయం

కింజారపు (రామ్మోహన్ నాయుడు ఇంటిపేరు), బండారు సత్యనారాయణ మూర్తి కుటుంబాల మధ్య 30 ఏళ్లుగా మంచి సంబంధాలు ఉన్నాయి.

పెళ్లి పైన బండారు సత్యనారాయణ మాట్లాడుతూ... ముప్పై ఏళ్లుగా తమ ఇద్దరి కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. రామ్మోహన్ నాయుడు తనకు అల్లుడు కావడం సంతోషంగా ఉందన్నారు. ఎర్రన్నాయుడు, తాను మంచి స్నేహితులం అని చెప్పారు. తామిద్దరం దాదాపు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామన్నారు. కుటుంబ స్నేహితులం.. బంధువులుగా మారుతున్నామని సంతోషమన్నారు.

రామ్మోహన్ నాయుడు తనకు చిన్నప్పటి నుంచి తెలుసునని చెప్పారు. త్వరలో ఎంగేజ్‌మెంట్, పెళ్లి తేదీలను ప్రకటిస్తామన్నారు.

ఇదిలా ఉండగా, బండారు సత్యనారాయణ మూర్తి పెద్ద కూతురు హర్షిణి బెంగళూరులో మెడిసిన్ చదివారు. అమెరికాలో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న వినయ్‌ను పెళ్లి చేసుకున్నారు. హర్షిణి పెళ్లి ఫిబ్రవరి 16న జరిగింది. రిటైర్డ్ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ ఆఫ్ పంచాయతీరాజ్ డిపార్టుమెంట్ చిన్న బాబు కొడుకే.. వినయ్.

మరోవైపు, అబ్బాయి రామ్మోహన్ నాయుడుకు, అమ్మాయి శ్రీ శ్రావ్యకు బాగా సెట్ అయిందని చెబుతున్నారు. శ్రావ్యను తొలి చూపులోనే రామ్మోహన్ నాయుడు ఇష్టపడ్డారని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+