వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను యాక్ట‌ర్ నే...! జైలుకెళ్లొచ్చావ్..! నిన్నేమ‌ని పిల‌వాలి..? జ‌గ‌న్ పై శివాలెత్తిన గ‌బ్బ‌ర్ సింగ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Election 2019 : జ‌గ‌న్ పై శివాలెత్తిన పవన్ కళ్యాణ్ | Oneindia Telugu

ప్ర‌కాశం/హైద‌రాబాద్ : జ‌న‌సైనికుడికి మ‌ళ్లీ ఆవేశం వ‌చ్చింది. తాను నిఖార్సైన రాజ‌కీయాలు చేస్తాను త‌ప్ప ఏపి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిలా దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు పాల్ప‌డ‌న‌ని తేల్చి చెప్పారు. తల తెగిపడినా వైఎస్.జగన్ మాదిరి మోదీ, అమిత్ షా ద్వయం ముందు మోకరిల్లబోనని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

జనసేన పార్టీ టీడీపీ భాగస్వామేనంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ తీవ్రంగా మండిపడ్డారు. తెరచాటు, దొంగ పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం, అగత్యం తనకు లేదని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలతో పొత్తులపై బహిరంగంగా సమాధానం చెప్పాలని గ‌బ్బ‌ర్ సింగ్ వైసీపీని డిమాండ్ చేశారు.

ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ (ఫొటోలు)

Yes..am an actor..! You went to jail..! what should i call..? Pavan fired on Jagan Mohan Reddy..!!

ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్ర‌కాశం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్రసంగించారు. నటన వదిలేసి పూర్తి స్థాయి రాజకీయాలకు వచ్చానని, సినిమా యాక్టర్ అని తనను అంటుంటే, జైలులో చిప్పకూడు తిని వచ్చిన జగన్ ను తాను ఏమని పిలవాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వని, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న కేంద్రం వద్ద తన ఆత్మగౌరం తాకట్టు పెట్టే ప్రసక్తి లేదన్నారు. స్వార్థ రాజ‌కీయాల కోసం ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఆరోప‌ణ‌లు చేస్తే స‌హించేది లేద‌ని కాట‌మ‌రాయుడు ఇత‌ర రాజ‌కీయ పార్టీల‌ను హెచ్చ‌రించారు.

English summary
Pawan Kalyan is visiting Prakasam district as part of the election campaign. Addressing people in public meetings. He says that he has come out of full politics from acting, and says that he is a film actor, Pavan asks what to call Jagan, who was went for Jail..?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X