వెయింటింగ్ లిస్ట్ ఉన్నా టికెట్ కన్ ఫర్మ్ చేసుకోవచ్చు... ఎలాగో తెలుసా?
మనం ప్రయాణించాలనుకుంటున్న రైలులో బెర్త్ లు ఖాళీ లేనప్పుడు ఒక్కోసారి మనకు వెయిటింగ్ లిస్ట్‌లో చోటు లభిస్తుంది.
పండగల సీజన్లలో రైలు టికెట్ కన్ఫర్మ్ అయ్యిందంటే ప్రయాణికుల ఆనందానికి అవధులుండవు. సాధారణ సమయాల్లోనూ రద్దీ రూట్లలో టికెట్ కన్ఫర్మ్ కావడం కష్టమవుతుంటుంది. దీనికి పరిష్కారంగా భారతీయ రైల్వే పలు చర్యలు చేపట్టింది. అందులో భాగమే వికల్ప్ స్కీం. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు కన్ఫర్మ్ చేసిన బెర్త్ అందించడమే లక్ష్యంగా ఐఆర్‌సీటీసీ ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దీన్ని ఆల్టర్నేటివ్ ట్రైన్ అకామడేషన్ స్కీం అని అంటున్నారు.

పీఎన్ ఆర్ నెంబరును ఎంటర్ చేయాలి
మనం ప్రయాణించాలనుకుంటున్న రైలులో బెర్త్ లు ఖాళీ లేనప్పుడు ఒక్కోసారి మనకు వెయిటింగ్ లిస్ట్‌లో చోటు లభిస్తుంది. అంటే టికెట్ కన్ఫర్మ్ అయిన ప్రయాణికుల్లో ఎవరైనా తమ టికెట్ ను రద్దు చేసుకుంటే ప్రాధాన్య క్రమంలో ఆ సీటును వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి కేటాయిస్తారు. అయితే, చివరి వరకూ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే. ఈ వికల్ప్ స్కీంను మనం ఉపయోగించుకోవచ్చు. మనం టికెట్ ను బుక్ చేసుకునే సమయంలోనే ఈ ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. PNR
నెంబర్‌ను ఎంటర్ చేసి అదే మార్గంలో ప్రయాణిస్తున్న మరిన్ని రైళ్లను ఎంపిక చేసుకోవాలి. ఆ రైళ్లలో దేంట్లో బెర్త్‌లు ఖాళీ ఉంటే దాంట్లో మనకు సీటు కేటాయిస్తారు. అలా మనకు నచ్చిన ఏడు రైళ్లను ఎంపిక చేసుకోవచ్చు. అదే రోజు లేదంటే మూడు రోజుల వరకు అందుబాటులో ఉన్న ఏ రైలునైనా ఎంచుకోవచ్చు. అలా తమ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నప్పటికీ.. ప్రయాణికులకు బెర్త్ కన్ఫర్మ్ చేసుకునే వెసులుబాటును రైల్వేశాఖ కల్పిస్తోంది.

ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్..
రైల్వేలో కన్ఫర్మ్ అయిన బెర్త్ పొందడానికి మరో మార్గం ఉంది. అదే ఆటో అప్‌గ్రేడ్. టికెట్ కొనుగోలు సమయంలోనే ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం స్లీపర్ క్లాస్‌కు టికెట్ బుక్ చేసుకుంటే.. ఆటో అపగ్రేడ్ ఎంచుకుంటే.. స్లీపర్ కంటే పై తరగతిలో ఏదైనా బెర్త్ ఖాళీ అయితే దాన్ని కేటాయిస్తారు. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఒక్కోసారి ఫస్ట్ క్లాస్ ఏసీలో కూడా మనకు బెర్త్ దొరికే అవకాశం ఉంది. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడంతో పాటు రైలులో ఖాళీ బెర్త్‌లు సద్వినియోగమయ్యేలా రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. వికల్ప్ స్కీంను ఎంచుకున్న ప్రయాణికులకు ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ ఆప్షన్ అమలవుతుంది. అంటే వేరే రైలులో ఏ తరగతిలోనైనా మనకు బెర్త్ దొరికే అవకాశం ఉంది.

ఈ విషయాలు గుర్తుంచుకోవాలి..
వికల్ప్ స్కీంను ఎంచుకున్నంత మాత్రాన కచ్చితంగా ఇంకో ట్రైన్‌లో బెర్త్ లభిస్తుందన్న గ్యారంటీ లేదు. మనం ఎంపిక చేసుకునే రైళ్లలో ఉన్న ఖాళీ బెర్త్‌లు, సమయం, ప్రయాణించే మార్గంపై అది ఆధారపడి ఉంటుంది.ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటేనే ఈ అవకాశం లభిస్తుంది.ఒకసారి మరో రైలులో మనకు బెర్త్ కేటాయిస్తే.. క్యాన్సిలేషన్ ఛార్జీలు ఆ రైలు, బెర్త్ స్థితిపై ఆధారపడి ఉంటాయి.రైలు ఎక్కే స్టేషన్, దిగే స్టేషన్లలో మార్పులు జరిగే అవకాశం ఉంది. వీలైనంతమేరకు దగ్గర్లో ఉన్న స్టేషన్లకు మార్చే అవకాశం ఉంటుంది.బుక్ చేసుకున్న టికెట్ హిస్టరీ లింక్ ద్వారా ఛార్ట్ సిద్ధమవడానికి కొద్దిసేపటి ముందు కూడా వికల్ప్ స్కీంను ఎంచుకోవచ్చు.
ఛార్ట్ సిద్ధమైన తర్వాత కచ్చితంగా ఒకసారి పీఎన్‌ఆర్ స్టేటస్‌ను చెక్ చేసుకోవాలి.ఈ వికల్ప్ స్కీం అన్ని రకాల రైళ్లు, క్లాస్‌లకు అందుబాటులో ఉంటుంది.ఛార్ట్ తర్వాత 'ఫుల్లీ వెయిటింగ్ లిస్ట్'లో ఉన్న ప్రయాణికులనే వికల్ప్ కింద మరో రైలులో బెర్త్ కేటాయించేందుకు రైల్వే శాఖ పరిగణనలోకి తీసుకుంటుంది.ఒకవేళ మరో ట్రైన్‌లో పై తరగతిలో బెర్త్ లభిస్తే ఎలాంటి అదనపు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.వికల్ప్ ద్వారా మరో రైలులో బెర్త్ కన్ఫర్మ్ అయితే వారి పేర్లు ఒరిజినల్ ట్రైన్ కు సంబంధించిన వెయిటింగ్ లిస్ట్‌లో ఉండవు. ఇతర రైళ్లకు బదిలీ చేసిన పేర్లతో ప్రత్యేక జాబితాను రూపొందిస్తారు. ఇతర రైళ్లల్లో బెర్త్ కేటాయించినప్పటికీ ప్రయాణం చేయకపోతే.. టీడీఆర్ రిక్వెస్ట్ ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు












Click it and Unblock the Notifications