ఏపీలో మరో యువతి మృతి..నిందితుడు టీడీపీ కార్యకర్తే..!

ఏపీలో మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో యువతి మరణించింది. మూడురోజుల కిందట నవీన్‌ అనే వ్యక్తి దాడి చేయడంతో మధిర సహాన అనే యువతి తీవ్రంగా గాయపడింది. ఈ దాడితో యువతి బ్రెయిన్‌ డెడ్‌ అయ్యింది. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్ది సేపటి క్రితం మరణించింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తుంది. విధులు ముగించుకుని ఇంటికి వస్తోన్న సహానపై నవీన్ దాడి చేశాడు.ఈ దాడిలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సహానను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన నవీన్ అక్కడ నుంచి పరారయ్యాడు.మూడు రోజుల నుంచి వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడిన సహాన మంగళవారం మరణించింది. అయితే నవీన్ టీడీపీ కార్యకర్త అని తెలుస్తోంది. నవీన్ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత , సీఎం చంద్రబాబుతో దిగిన ఫొటోలు సైతం వైరల్ అవుతున్నాయి.

young woman named Sahana died after being attacked by Naveen

సహాన మరణంపై వైసీపీ మాజీ మంత్రి రోజా స్పందించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సహన మృతి చెందడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న జిల్లాలో, మహిళ హోంమంత్రి గా ఉన్న ఈ రాష్ట్రంలో టీడీపీ రౌడీ షీటర్ కిరాతకంగా దాడి చేసి సహానాను హత్య చెయ్యడం దారుణం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య. ఈ హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనితలే బాధ్యత వహించాలని రోజా డిమాండ్ చేశారు. మూడు రోజులుగా మృత్యువుతో పోరాడిన సహానకి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కానీ, హోంమంత్రి కానీ వెళ్లి వైద్యులను అదేశించకపోవడం దారుణమని ఆమె తెలిపారు.

ఇంకా ఎంత మంది అడబిడ్డలను బలి తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. టీడీపీ నేతలు, రౌడీ షీటర్ల నుండి మహిళల మాన, ప్రాణాలను ముప్పు ఉంది. తక్షణమే సహానాను హత్య చేసిన టీడీపీ రౌడీ షీటర్ నవీన్‌ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రోజా. రియాలిటీ షో కి వెళ్లి వినోదం పొందిన సీఎం చంద్రబాబు ఇప్పుడు సహాన తల్లి కన్నేటికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.సహాన ఆత్మ శాంతించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని మాజీ మంత్రి రోజా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+