ఆస్తికోసం సొంత అన్ననే హతమార్చి, ఇంట్లో పూడ్చిపెట్టాడు
కడప: ఆస్తి కోసం సొంత అన్ననే అతి కిరాతకంగా హత్య చేసి ఇంటిలోనే పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రి పురం మండలం మిథునాపురం గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన గంగాధర్‌రెడ్డి (43), పెద్దిరెడ్డి (36) ఇద్దరూ అన్నదమ్ములు. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా ఆస్తి కోసం తగాదా జరుగుతుతోంది. ఈ క్రమంలో ఆదివారం పెద్దిరెడ్డి తన సొంత అన్న గంగాధర్‌రెడ్డిపై దాడి చేసి కర్రతో చితకబాది హతమార్చాడు.

అనంతరం ఎవరికీ అనుమానం కలగకుండా మృతదేహాన్ని ఇంటిలోనే పూడ్చి పెట్టాడు. ఈ క్రమంలో భర్త కనిపించకపోయే సరికే గంగాధర్‌రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం ఉదయం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.












Click it and Unblock the Notifications