పాముతో సరదా సెల్ఫీ.. యువకుడు మృతి
అనువుగాని చోట అధికులమనరాదు అనే సామెతను పక్కనబెట్టి నేటి యువత సెల్ఫీలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ సెల్ఫీలు దిగుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. సెల్ఫీలతో సరాదా ఏమో గానీ నిండు జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాముతో సెల్ఫీ దిగాలనుకున్న యువకుడు అది కాటు వేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.
సూళ్లూరుపేట మండలం మంగళంపాడులో నివసించే ఓ యువకుడు పాముతో సెల్ఫీ దిగాలనుకుని ప్రాణాలు కోల్పోయాడు. పాముల ప్రదర్శనతో పొట్ట పోసుకునే వ్యక్తి దగ్గర ఉన్న సర్పాన్ని తీసుకుని మెడలో వేసుకుని సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అది కాస్తా కాటు వేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు.













Click it and Unblock the Notifications