అమ్మాయి ప్రేమించలేదని అతను ఆత్మహత్యాయత్నం

వరంగల్: ఓ యువతి తన ప్రేమను నిరాకరించడంతో ఓ యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దాంతో ప్రాణాలు దక్కించుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెలంగాణలోని ప్రాంతంలోని వరంగల్ నగరంలో గల భరత్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం డిప్లమా చదువుతున్నాడు.

నగరంలోని సింగగిరికి చెందిన ఓ యువతి అదే కళాశాలలో ద్వితీయ సంవత్సరం డిప్లమా చదువుతోంది. ఆమెను భరత్ మొదటి ఏడాది నుంచే ప్రేమించడం ప్రారంభించాడు. తనకు ఇష్టం లేదని అమ్మాయి చెప్పినా అతను వినలేదు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఫిర్యాదు చేయడంతో భరత్‌ను ప్రిన్సిపాల్ హెచ్చరించారు కూడా.

Youth attempts suicide, as girl rejects

అయినా భరత్ పట్టు వీడలేదు. దాంతో అమ్మాయిని తల్లిదండ్రులు నాలుగు నెలలుగా కళాశాలకు పంపించడం లేదు. ఆమె కళాశాలకు రాకపోవడంతో ఆణె ఇంటి చిరునామా తీసుకుని బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఓ బాటిల్‌తో పెట్రోల్ తీసుకని ఆమె ఇంటి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేదు.

అక్కడే భరత్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఒళ్లంతా మంటలు లేవడంతో అతను పరుగులు తీయడం ప్రారంభించాడు. అమ్మాయి తల్లి గమనించి బిందెలతో నీళ్లు తీసుకుని వచ్చి భరత్ ఒంటిపై పోసింది. స్థానికులు అతన్ని అస్పత్రికి తరలించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+