ఉద్యోగం రాలేదని మనస్తాపం: తాతయ్య క్షమించండంటూ ఆత్మహత్య
విశాఖపట్నం: ఉద్యోగం రాలేదంటూ మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. "మీరు కష్టపడి చదివించినా.. నిలబెట్టుకోలేకపోయాను... తాతయ్యా క్షమించండి" అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని శివాజీపాలెం మంగాపురం కాలనీలో జరిగింది.
ఆ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు సమీపంలోని ముత్యాలపాలేనికి చెందిన ఆడబాల వెంకట సత్యశ్రీనివాస్ కుమార్ (23) ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సును నిరుడు పూర్తి చేశాడు.

కొంత కాలం హైదరాబాదు వెళ్లి ప్రైవేట్ ఉద్యోగం చేశాడు. చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడంతో నెల కిందట నగరానికి వచ్చాడు. ఇక్కడ శివాజీపాలెం మంగాపురం కాలనీలో అద్దె ఇంట్లో స్నేహితుల వద్ద ఉంటున్నాడు. ఉద్యోగం లేదని బంధువులు హేళన చేయడంతో అతను మనస్తాపానికి గురయ్యాడు.
ఆదివారం రాత్రి అతని స్నేహితులు రమణ, దిలీప్, రవికుమార్ భోజనానికి వెళ్లిన తర్వాత సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో అతని స్నేహితులు వచ్చి తలుపు తట్టారు. ఎంతకూ తీయకపోవడంతో అనుమానంతో కిటికీలోంచి చూశారు.
గదిలో శ్రీనివాస కుమార్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. బలవంతంగా తలుపులు తెరిచారు. గదిలో వేలాడుతున్న స్నేహితుడిని కిందికి దింపి పరిశీలించారు. అతను మృతి చెందాడని నిర్ధారించుకని ఎంవిపీ కాలనీలో ఉంటున్న అతని సోదరుడు కె. నూకరాజుకు సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications