సిరంజీలతో యువకుడి వీరంగం: అంతర్జాతీయ స్మగ్లర్ రాజూభయ్యా అరెస్టు
విజయవాడ: కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం సగ్గూరులో సిరంజీలతో శివ అనే యువకుడు వీరంగం సృష్టించాడు.స్థానిక యువకులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. శివకు మతిస్థిమితం లేదని పోలీసులు తేల్చారు. శివ వద్ద నుంచి నాలుగు సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలావుంటే, చిత్తూరు జిల్లాలో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ జితేందర్ మోహన్‌లాల్ అలియాస్ రాజూ భయ్యాను ముంబైలో చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఉల్లిపాయల వ్యాపారం ముసుగులో రాజూభాయ్ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నాడని తేలింది. చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతంలో ఎర్రచందనాన్ని కొనుగోలు చేసి కోల్‌కతా, ముంబై నుంచి విదేశాలకు తరలిస్తున్నాడని వెల్లడైంది.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
కృష్ణా జిల్లా అగ్రిపల్లి మండలం వండ్లమానులో వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. అదనపు కట్నం తీసుకురావాలన్న భర్త వేధింపులు భరించలేక సిరి అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుందని అనుమానిస్తున్నారు. అయితే ఇది ఆత్మహత్య కాదని అత్తింటి వారే చంపేశారని సిరి కన్నవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గుర్తుతెలియని వ్యక్తి హత్య
కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తిని దారుణంగా చంపేశారు. హత్య చేసిన అనంతరం మృతదేహంపై పెట్రోలు పోసి తగులబెట్టారు. ఈ సంఘటన నగరంలో సంచలనం సృష్టించింది. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు.
తాగడానికి డబ్బులివ్వలేదని ఆత్మహత్య
మద్యం తాగటానికి భార్య డబ్బులివ్వలేదని ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దుర్గి మండలం ముటుకూరులో సోమవారం ఈ విషాదం జరిగింది. గ్రామానికి చెందిన జడ వాసు (25) మద్యానికి బానిసయ్యాడు. సోమవారం భార్య నాగమణిని డబ్బులు అడిగాడు.
డబ్బులు ఇవ్వడానికి ఆమె నిరాకరించింది. దీంతో భార్యపై అలిగిన వాసు పురుగుమందు తాగాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వాసు మృతిచెందాడు. భార్య డబ్బులివ్వనందుకే ఆత్మహత్య చేసుకున్నట్టు వాసు తన మరణ వాంగ్మూలంలో తెలిపాడు. వాసుకి ఇద్దరు పిల్లలున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications