హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రశ్నలు చెప్తానని అసభ్య ప్రవర్తన: పెళ్లికి నో చెప్పిందని...

By Srinivas
|
Google Oneindia TeluguNews

Youth harasses girlfreind, arrest
హైదరాబాద్: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని స్థానికులు బుధవారం రాత్రి పోలీసులకు అప్పగించారు. మౌలాలీలోని జవహర్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ హైస్కూలులో బుధవారం సాయంత్రం పదో తరగతి చదువుతున్న బాలికకు ముఖ్యమైన ప్రశ్నలు చెబుతానని చెప్పి ప్రాన్సిస్ అనే 45 అయిదేళ్ల వ్యక్తి పాఠశాల ఆవరణలోని గదిలోకి తీసుకు వెళ్లాడు.

అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి ప్రవర్తనతో బాలిక పెద్దగా కేకలు వేసింది. దీంతో తోటీ విద్యార్థుల ద్వారా విషయం బయటకు పొక్కింది. స్థానికులు ఆగ్రహంతో పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిందితుడిని పోలీసులు మల్కాజిగిరి పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

యువతికి ప్రేమ, పెళ్లి వేధింపు

ఓ యువతిని ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్న బిటెక్ విద్యార్థిపై ముషీరాబాద్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. అదిలాబాద్ జిల్లా తన మండలం రియాడి గ్రామానికి చెందిన సాయి నగరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

అదే కళాశాలలో ముషీరాబాద్‌కు చెందిన యువతి చదువుతోంది. ఆమెతో పరిచయం పెంచుకున్న సాయి... కొంతకాలంగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. యువతి నిరాకరించడంతో సెల్ ఫోన్‌కు అసభ్యకర సందేశాలు పంపిస్తున్నాడు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టు చేశారు.

English summary
Hyderabad police have arrested a youth for sending abusive messages to his frind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X