ఫేస్‌బుక్‌లో ఫోటోస్ పెడ్తానని యువతికి బెదిరింపు, అరెస్ట్

బంజారాహిల్స్ పరిధిలోని ఓ బస్తీలో నివసిస్తున్నాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఫోన్‌లో పరిచయం అయింది. దీనిని ఆసరాగా చేసుకొని అతను ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం యువతికి పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలియడంతో అతను ఆమె ఇంటికి వెళ్లాడు.
తనను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటే ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
రెస్క్యూ హోం నుండి యువతులు అదృశ్యం
ఓ రెస్క్యూ హోంలో ఉండే నలుగురు యువతులు ఎవరికీ చెప్పకుండా బయటకి వెళ్లి అదృశ్యమైన సంఘటన ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై కథనం ప్రకారం.. పలు కేసుల్లో బాధితులైన నలుగురు యువతులను పోలీసులు ఇటీవలి కాలంలో హస్తినాపురంలోని ఓ రెస్క్యూ హోంలో ఉంచారు. వారు ఈ నెల 10న సాయంత్రం ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి కనిపించకుండా పోయారు. రెస్క్యూ హోం నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications