పెళ్లి చూపులు జరుగుతుంటే.. అమ్మాయిని ముద్దాడిన ప్రియుడు!

విశాఖపట్నం: తను ప్రేమించిన యువతికి పెళ్లి చూపులు జరుగుతున్నాయని తెలిసి వెంటనే అక్కడికి బయల్దేరాడు ప్రియుడు. ప్రియురాలి ఇంట్లోకి వెళ్లిన ఆ యువకుడు.. అందరి ముందే ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బక్కన్న పాలెం గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతని పెద్ద కుమార్తెకు శుక్రవారం పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు.

 A youth kissed his girlfriend in her house

కాగా, పెళ్లిచూపులు జరుగుతున్న సమయంలో, హఠాత్తుగా అక్కడకు ఓ యువకుడు వచ్చి.. అందరూ చూస్తుండగానే అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు.

ఆ యువకుడు అదే ప్రాంతంలో ఉన్న ఓ పెద్ద కుటుంబానికి చెందిన చెందిన వాడు. జరిగిన ఘటనతో మగపెళ్లివారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులను ఆ యువకుడు ఒప్పించాడు. వారి వివాహానికి అతని తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో కథ సుఖాంతమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+