ఫేస్‌బుక్ కలిపిన బంధం: 21ఏళ్ల తర్వాత తల్లిదండ్రులను కలిసిన కుమారుడు

అనంతపురం: దాదాపు 21ఏళ్ల తర్వాత సోషల్ మీడియా ఫేస్‌బుక్ సాయంతో ఓ యువకుడు తన తల్లిదండ్రులను కలుసుకున్న ఘటన అనంతపురంలో జిల్లాలో చోటు చేసుకుంది. సినిమాల్లో నటించాలనే కోరికతో తమను విడిచి వెళ్లిన కొడుకు ప్రయోజకుడిగా తిరిగి రావడంతో ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిసాయి.

వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా సింహాద్రిపురం మండలం చెర్లోపల్లికి చెందిన అన్నవరం రాఘవరెడ్డి, శేఖర్ రెడ్డి, అంకిరెడ్డి అన్నదమ్ములు. వ్యాపార నిమిత్తం కొన్నేళ్ల క్రితం అనంతపురం జిల్లా తాడిపత్రికి వచ్చి స్థిరపడ్డారు. శేఖర్ రెడ్డి, వెంకటలక్ష్మి దంపతులకు అమరనాథ రెడ్డి, రాజారెడ్డి, నందకుమార్ రెడ్డి అనే ముగ్గురు కుమారులున్నారు.

వీరిలో అమరనాథ రెడ్డికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఎలాగైనా సినిమాల్లో నటించాలన్న కోరికతో 1994, అక్టోబర్ 15న ఇంటి నుంచి పారిపోయాడు. అతని ఆచూకీ కోసం కుటుంబసభ్యులు కొన్నేళ్లపాటు తీవ్రంగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఎప్పటికైనా తమ ఇంటికి తిరిగి వస్తాడనే ఆశతో ఆ తల్లిదండ్రులు ఎదురుచూస్తూనే ఉన్నారు.

 A youth met his parents with help of Facebook

కాగా, ఎన్నో ప్రయత్నాలు చేసిన అమరనాథ రెడ్డి చివరకు పలు సినిమాల్లో నటించే అవకాశాన్ని పొందాడు. పలు సీరియళ్లలో విలన్ పాత్రలో నటించి పలువురి నుంచి ప్రశంసలు పొందాడు. దరువు, కాస్కో, శంకరాభరణం, మెంటల్ కృష్ణ, శౌర్య మొదలగు సినిమాల్లో అమరనాథ రెడ్డి నటించారు. ఇక బుల్లి తెర విషయానికస్తే.. మొగలిరేకులు, ఆడపిల్ల, జాబిలమ్మ సహా పలు సీరియళ్లలో అతను నటించాడు.

అయితే పెరిగి పెద్దవాడైన అమరనాథ రెడ్డి.. నల్లగడ్డం, పెద్ద జుట్టు, పొడుగ్గా తలకు టోపీ పెట్టుకుని ఉండటంతో తల్లిదండ్రులు గానీ, బంధువులు గానీ గుర్తించలేకపోయారు. కాగా, బాబాయి అంకిరెడ్డి కుమారుడు హరీశ్ రెడ్డి ఫేస్‌బుక్‌లో ఇంటి పేరు ‘అన్నవరం' ఉండటాన్ని గమనించి అమరనాథరెడ్డిని గుర్తించాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఫేస్‌బుక్ పరిచయం పెరిగింది. ఆ తర్వాత ఇద్దరూ ఫోన్‌లో తరచూ మాట్లాడుకునేవారు.

ఈ క్రమంలో మూడు నెలల కిందట వారి మూలాలేమిటో, కుటుంబసభ్యుల వివరాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత అమరనాథ రెడ్డి ఫోన్‌లో తన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో మాట్లాడారు. దాదాపు 21ఏళ్ల తర్వాత సోమవారం తన తల్లిదండ్రులను కలుసుకున్నారు అమరనాథ రెడ్డి. చాలా కాలం కుటుంబానికి దూరంగా ఉండి, అనుకున్నది సాధించిన కుమారుడ్ని చూసిన తల్లిదండ్రులు ఆనందపరవశులయ్యారు.

తమ కుమారుడ్ని ఆ దేవుడే తమతో కలిపారని అమరనాథరెడ్డి తల్లిదండ్రులు శేఖర్ రెడ్డి, వెంకటలక్ష్మి అన్నారు. ఇల్లు వదిలాకా చాలా కాలంపాటు అతని కోసం వెదికామని, తీవ్ర మనోవేదనకు గురయ్యామని చెప్పారు. ఇప్పుడు తమ కొడుకు తిరిగి రావడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. కాగా, తన తల్లిదండ్రులను కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు అమరనాథరెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+