అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువత చెడు అలవాట్లు: వెంకయ్య, ఆకట్టుకున్న స్కేటింగ్ విన్యాసం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, నిర్ధిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. యువత ఆరోగ్యం, అభివృద్ధే లక్ష్యంగా నిర్వహిస్తున్న గ్లోబల్ యూత్ మీట్ (జిమ్) ఆదివారం వుడా పార్కులో అట్టహాసంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యంతోనే ఆనందకరమైన జీవితం సాధ్యమన్నారు. నేటి యవతకు ఫిజికల్ ఎడ్యుకేషన్ చాలా అవసరమన్నారు. ఆహారపు అలవాట్ల వల్ల యువత ఒబెసిటీ వంటి సమస్యలతో సతమతవుతున్నారన్నారు.

యువత చెడు అలవాట్లు: వెంకయ్య

యువత చెడు అలవాట్లు: వెంకయ్య

మాదకద్రవ్యాల వల్ల జీవితాలనే కోల్పోతున్నారని చెప్పిన ఆయన చిన్న వయస్సులోనే దురాలవాట్లకు బానిసలు కావడం వల్ల పూర్తి వ్యవస్థపైనే ప్రభావం చూపుతోందన్నారు. పర్యావరణ సమతుల్యతో పాటు పరిసరాల పరిశుభ్రతపైనా యువత దృష్టి సారించాలని చెప్పారు.

 యువత చెడు అలవాట్లు: వెంకయ్య

యువత చెడు అలవాట్లు: వెంకయ్య

యువత ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటే భవిష్యత్తు ఆనందంగా ఉంటుందన్నారు. యువత సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దేశంలో కృషి, శ్రమ, పట్టుదలతో దాన్ని సాకారం చేసుకోవాలన్నారు.

యువత చెడు అలవాట్లు: వెంకయ్య

యువత చెడు అలవాట్లు: వెంకయ్య

దేశంలో గొప్ప సాంస్కృతిక సంపద ఉందని, దాన్ని యువతే పరిరక్షించాలన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలకు టెర్రరిజం సమస్యగా మారిందని, పోరుగుదేశం అలాంటి వారిని ప్రోత్సహించి ఇప్పుడు బాధిత దేశంగా మారిందన్నారు. అందుకే యువత టెర్రరిజాన్ని ముక్తకంఠంతో ఖండించాలన్నారు.

యువత చెడు అలవాట్లు: వెంకయ్య

యువత చెడు అలవాట్లు: వెంకయ్య

భారతదేశమంటేనే మానవత్వానికి ప్రతీకని పేర్కొన్నారు. రాష్ట్రంలో విశాఖకు మంచి భవిత ఉందని చెప్పారు. మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ హరిబాబు మాట్లాడుతూ యువతతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం జిమ్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి తదితరులు మాట్లాడారు.

 యువత చెడు అలవాట్లు: వెంకయ్య

యువత చెడు అలవాట్లు: వెంకయ్య

ఈ సందర్భంగా అతిథులకు హృదయ్ నిర్వాహకులు బహుమతలను అందజేశారు. కేంద్ర మంత్రి వెంకయ్య నేవీ బ్యాండ్‌తో సెల్యూట్ పలకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ వేషధారణల్లో కొందరు యువత ఆకట్టుకున్నారు. ఇక ఈ ముగింపు వేడుకలను డిసెంబర్ రెండున హోటల్ నోవాటెల్‌లో నిర్వహించనున్నారు.

English summary
Youth need maintain distance to bad habits says minister Venkaiah Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X