జగన్, చంద్రబాబుకీ సేమ్ సమస్య-నేతలకు ముందస్తుపై ఫుల్ క్లారిటీ ! వరుస క్లాస్ ల వెనుక ?

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయింది. మరో రెండేళ్లలోపే ఎన్నికలు ఉండబోతున్నాయి. అయితే కొన్ని నెలల క్రితం వైసీపీ మొదలుపెట్టిన ప్రచార హంగామాతో ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్దమైపోతున్నారన్నసంకేతాలు వెలువడ్డాయి. దీంతో వైసీపీతో పాటు విపక్షాలు కూడా ముందస్తు ఏర్పాట్లు మొదలుపెట్టేశారు. జనంలోకి వరుసగా తిరుగుతూ విమర్శలకు పదునుపెట్టారు. కానీ తాజాగా ఆ వాతావరణం మళ్లీ మారిపోతోంది.అదే ఇప్పుడు జగన్,చంద్రబాబు ఇద్దరినీ కలవరపెడుతోంది.

 మంత్రులకు వైఎస్ జగన్ క్లాస్

మంత్రులకు వైఎస్ జగన్ క్లాస్

ఏపీలో తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో తన మంత్రులకు వైఎస్ జగన్ ఓ రేంజ్ లో క్లాస్ పీకారు. అంతేకాదు విపక్షాల విమర్శలకు కౌంటర్లు ఇవ్వలేకపోతే చెప్పండి మంత్రివర్గ విస్తరణ చేపట్టి మిమ్మల్ని సాగనంపేస్తానంటూ హెచ్చరికలు పంపారు. తన సతీమణిని ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరికించేలా టీడీపీ విమర్శలు చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ మంత్రుల్ని జగన్ నిలదీశారు. దీనికి మంత్రుల వద్ద సమాధానం లేకుండా పోయింది. చివరికి ఇకపై అలా జరక్కుండా చూసుకుంటామంటూ సీఎంకు చెప్పి కేబినెట్ భేటీ నుంచి మంత్రులు బయటికి వచ్చేశారు.ఆ తర్వాత టీడీపీపై విరుచుకుపడటం మొదలుపెట్టేశారు.

కృష్ణా టీడీపీ నేతలపై చంద్రబాబు ఫైర్

కృష్ణా టీడీపీ నేతలపై చంద్రబాబు ఫైర్

తాజాగా విజయవాడలో టీడీపీ సీనియర్ నేత, మాజీ కార్పోరేటర్ చెన్నుపాటి గాంధీపై ప్రత్యర్ధులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కంటికి కూడా గాయమైంది. దీనిపై ఆలస్యంగా స్పందించిన పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసినా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని లైట్ తీసుకోవడంపై మండిపడ్డ చంద్రబాబు.. అదే సమయంలో జిల్లాకు చెందిన టీడీపీ నేతలు సైతం మౌనంగా ఉండిపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ నేతపై ప్రత్యర్ధులు తీవ్రంగా దాడి చేస్తే జిల్లా నేతలు స్పందించకుండా ఉండిపోవడమేంటని చంద్రబాబు వారిపై ఫైర్ అయ్యారు. మరోసారి ఇలాంటి పరిస్ధితులు రాకుండా చూసుకోవాలన్నారు. దీంతో నేతలు స్పందిస్తున్నారు.

వైసీపీ, టీడీపీ నేతల్లో అలసత్వం

వైసీపీ, టీడీపీ నేతల్లో అలసత్వం

ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఘటనలపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ఇరు పార్టీల్లోనూ అలసత్వం కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా స్తబ్ధుగా మారిపోయాయి. దీంతో నేతలకు కూడా దేనిపై స్పందించాలో, దేనిపై మౌనంగా ఉండిపోవాలో కూడా తెలియడం లేదు. దీని వెనుక ఆసక్తికరమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఆయా కారణాలు నేతల్ని ఈ దిశగా నడిపిస్తున్నాయన్న చర్చ కీలక నేతల్లో వినిపిస్తోంది. దీని వల్లే తాజాగా జగన్, చంద్రబాబు తమ పార్టీ నేతలకు క్లాస్ పీకాల్సిన పరిస్ధితులు ఏర్పడినట్లు చెప్తున్నారు.

 ముందస్తు హైప్ కొంపముంచిందా ?

ముందస్తు హైప్ కొంపముంచిందా ?

త్వరలో ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయన్నే అర్దం వచ్చేలా వైసీపీ అధినేత, సీఎం జగన్ రెండేళ్లకు ముందే నేతల్ని అప్రమత్తం చేస్తూ గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బాదుడే బాదుడుకు రూపకల్పన చేశారు. ముందస్తు ఎన్నికలు వస్తే అందుకు సిద్ధంగా ఉండాలన్న ఆలోచనతో ఈ రెండు కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి. అయితే గడప, గడపకూ ప్రభుత్వమైనా, బాదుడే బాదుడే అయినా ఓ స్ధాయి వరకూ నేతలు చురుగ్గా పాల్గొనడం, విమర్శలు చేయడం సహజం. కానీ ఆ పరిధి కాస్తా దాటిపోవడంతో నేతల్లో ఓ రకమైన అలసత్వం వచ్చేసింది. ముందస్తు ఎన్నికలు వచ్చేది లేదు చచ్చేది లేదు అనవసరంగా తమ పార్టీ అధినేతలు తమను పరుగులు తీయిస్తున్నారన్న భావన వారిలో కనిపిస్తోంది. అందుకే నేతలు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఏదైనా ఓ పెద్ద ఘటన లేదా రాజకీయ పరిణామం చోటు చేసుకుంటే కానీ నేతల్లో మళ్లీ ఊపు వచ్చేలా లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+