వైసీపీ జాబితాలో 50 శాతం బీసీ, ఎస్సీలకే - లిస్టు ఇలా, ఇవీ ప్రత్యేకతలు..!!

వైసీపీ తమ అభ్యర్దుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. 2019 ఎన్నికల తరహాలోనే ఇప్పుడు ఇడుపులపాయ లో వైఎస్సార్ ఘాట్ వేదికగా పార్టీ అభ్యర్దుల జాబితా ప్రకటించింది. ఎమ్మెల్యే అభ్యర్దులను పార్టీ నేత ధర్మాన..ఎంపీ అభ్యర్దుల లిస్టును నందిగం సురేష్ ప్రకటించారు. సీఎం జగన్ సమక్షంలో ఒకే సారి మొత్తం పోటీలో నిలిచే అభ్యర్దులను వెల్లడించారు. సామాజిక న్యాయం..మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్దులను ఖరారు చేసారు.

ఏ వర్గానికి ఎన్ని : ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో 50 శాతం సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కేటాయించారు. 175 ఎమ్మెల్యే స్థానాల్లో 29 ఎస్సీ, 7 ఎస్టీ, 48 బీసీ, 91 ఓసీ, 7 మైనార్టీ వర్గాలకు ఖరారు చేసారు. ఇందులో అన్ని వర్గాలకు చెందిన 19 మంది మహిళలకు అవకాశం ఉంది. ఎంపీల్లో బీసీ 11, ఓసీలకు 9, ఎస్సీలకు 4, ఎస్టీ 1 నియోజకవర్గాలు కేటాయించారు. అందులో 5 స్థానాలు మహిళలు ఉన్నారు. మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్దులు 200 మంది కాగా వారిలో 100 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలకు కేటాయించటం ఒక రికార్డుగా వెల్లడించారు. 2019 కంటే మహిళలకు నాలుగు అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా కేటాయించారు. 2019లో మహిళలకు 15 స్థానాలు ఇవ్వగా, ఇప్పుడు 19కి పెంచారు.

YS Jagan Announces his party contesting MP and MLA s Candidates final list at Idupulapaya

ఎవరు ఎక్కడ పోటీ : సిట్టింగ్ స్థానాల్లో 32 మంది ఎమ్మెల్యే, 14 ఎంపీలను పక్కన పెట్టారు. పార్టీ కేడర్ లో ఉన్న వారికి 14 మందికి ఎన్నికల్లో పోటీకి అకవాశం కల్పించారు. 131 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీ అభ్యర్దులు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 17 డాక్టర్లు, 34 మంది ఇంజనీర్లు, 2 సివిల్స్ అధికారులకు అవకాశం దక్కింది. అభ్యర్దుల్లో 77 శాతం మంది ఉన్నత విద్యా వంతులను ఎంపిక చేసారు. ఎంపీల్లో ఇప్పటికే ప్రకటించినవి కాకుండా కొత్తగా ప్రకటించిన వారిలో విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్ ఉండగా..అనకాపల్లి బీసీకి ఇవ్వాలని నిర్ణయించారు. అనకాపల్లి నుంచి పేరు ప్రకటించలేదు. కడప ఎంపీగా తిరిగి అవినాశ్ రెడ్డికే కేటాయించారు. అరకు- చెట్టి అనుజా రాణి పేరు ఖరారు చేసారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్దుల మార్పులో భాగంగా ఖరారు చేసిన వారే పోటీ చేయనున్నారు.

వై నాట్ 175 లక్ష్యంగా : ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అభ్యర్దుల జాబితాను జగన్ సమక్షంలో మంత్రి ధర్మాన ప్రకటించారు. స్పీకర్ కు తిరిగి ఆముదాల వలస సీటు ప్రకటించారు. ధర్మాన సోదరులకు ఇద్దరికీ సీట్లు కొనసాగించారు. పవన్ కల్యాణ్ నుంచి పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగా గీతనే కొనసాగించాలని నిర్ణయించారు. కడప జిల్లాలో పది సిట్టింగ్ స్థానాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఎమ్మెల్యే అభ్యర్దుల విషయంలో ఇప్పటికే పది జాబితాలుగా వెల్లడించిన నియోజకవర్గాల ఇంఛార్జ్ ల మార్పుల మేరకే తుది జాబితాను ప్రకటించారు. తొలి నుంచి చెబుతున్నట్లుగా పూర్తిగా సామాజిక సమీకరణాలకు ఎంపీ, ఎమ్మెల్యే జాబితాలో ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో, 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఇక ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నట్లు వెల్లడించారు.

చేతల్లోనూ అమలు చేస్తున్నాం : కేవలం అనకాపల్లి ఎంపీ స్థానం మినహా అన్ని స్థానాలకు అభ్యర్దులను ప్రకటించామని జగన్ చెప్పుకొచ్చారు. మాటల్లోనే కాకుండా చేతల్లోనూ 50 శాతం సీట్లు కేటాయించి చిత్తశుద్ది చాటుకున్నామని చెప్పారు. ఇలా 50 శాతం స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వటం ఏపీ చరిత్రలోనే తొలి సారిగా జగన్ పేర్కొన్నారు. 59 స్థానాలు బీసీలకు కేటాయించామని చెప్పుకొచ్చారు. మహిళలకు గతం కంటే మరిన్ని స్థానాలు పెంచామ ని ..ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 77 శాతం మంది ఉన్నత విద్యా వంతులే ఉన్నారని జగన్ చెప్పారు. అవసరమైన స్థానాలలో మార్పు చేసామని వెల్లడించారు. ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం..నమ్మకం తమ పార్టీకే ఉందన్నారు. టికెట్ రాని వాళ్లకు భవిష్యత్ లో ప్రాధాన్యత ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+