అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో వారు జైలుకే - జగన్ హెచ్చరిక..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ప్రయివేటు మెడికల్ కాలేజీల ను పీపీపీ విధానంలో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది. దీనిని వైసీపీ వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే ఈ నిర్ణయం పైన నిరసనలు నిర్వహించింది. కోటీ సంతకాలు సేకరించింది. వీటిని మాజీ సీఎం జగన్ గవర్నర్ కు అందించనున్నారు. కాగా.. ఈ సందర్భంలో జగన్ కీలక హెచ్చరికలు చేసారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ ఆగే వరకూ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.
మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణను నిరసిస్తూ వైసీపీ పోరాటం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ రోజు కోటి సంతకాలతో గవర్నర్ ను కలవనున్న జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయనున్న కూటమి సర్కార్‌కు అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మెడికల్ కళాశాలల ప్రయివేటు నిర్వహణ బాధ్యత తీసుకునే వారిని రెండు నెలల్లో జైలుకు పంపుతామని హెచ్చరించారు. కాగా..మెడికల్ కళాశాలల ప్రైవేటీకర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం కోటి 4 లక్షల 11,136 మంది సంతకాల ప్రతులను లోక్‌భవన్‌లో గవర్నర్‌కు సమర్పించనున్నారు.

పేద, మద్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడం దారుణమని జగన్ పేర్కొన్నారు. ఉచిత వైద్యం అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ పెద్ద కుంబకోణమని, ఈ విషయంలో కోర్టులో అఫిడవిట్ వేస్తామని వెల్లడించారు. ప్రైవేట్ వారికి మెడికల్ కాలేజీలను అప్పగించి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తామని పేర్కొనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
విద్యను, ఆర్టీసీని, పోలీసు వ్యవస్థను ప్రైవేటీక రణ కు కూటమి ఆలోచిస్తుందని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలను నిర్ణయించిన క్యాలెండర్ ప్రకారం పేదలకు బటన్ నొక్కి అందజేశామని అన్నారు. రెండు సంవత్స రాలుగా కూటమి ప్రభుత్వం వల్ల ఒక్క మేలు జరుగలేదని పేర్కొన్నారు. ఉన్న పథకాలను రద్దు చేయడంతో పాటు సూపర్ సిక్స్‌తో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని జగన్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications