YS Jagan: ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై చంద్రబాబుకు క్లాస్.. ప్రజలకు క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రాజకీయ వర్గాలతో పాటు, ఇప్పుడు ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ప్రతిపక్ష పార్టీలు జగన్ సర్కార్ ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తూ, ఈ యాక్ట్ వల్ల మీ భూములు పోతాయని ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుంటే, దీనిపై స్పష్టత ఇచ్చే పనిలో పడ్డారు వైసీపీ నేతలు.

చంద్రబాబుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా
ఇక తాజాగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దీనిపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతల పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో తెలుసా అంటూ ప్రశ్నించారు. భూముల పై రైతులకు సంపూర్ణ హక్కులు కలిగించటమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశమని వైయస్ జగన్ పేర్కొన్నారు.

YS Jagan AP CM Jagan gives full clarity to opposition on land titling act

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జగన్ స్పష్టత
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి నేతలు ప్రజలకు ఫోన్లు చేసి జగన్ భూములు లాక్కుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇది అతిపెద్ద సంస్కరణ అవుతుందని, భూముల కోసం ప్రజలు, రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి భూములకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వటమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధాన ఉద్దేశమని జగన్ స్పష్టం చేశారు.

భూములపై రైతులకు సంపూర్ణ హక్కుల కోసమే
తమ భూములపై సంపూర్ణ హక్కులు రైతులకు కల్పించడానికి కోసం చేసే యాక్ట్ నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారని చంద్రబాబుకు జగన్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా భూములలో చాలా వివాదాలు ఉన్నాయని, వివాదాలు పరిష్కరణ కోసం అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ రైతులు తిరుగుతున్నారని, అటువంటి పరిస్థితులు లేకుండా రైతుల భూములకు భద్రత కల్పిస్తూ, వాటిపై ఎటువంటి వివాదాలు వచ్చినా పరిష్కరించేందుకే ఈ యాక్ట్ తెచ్చామన్నారు.

రైతుల భూములకు ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వటమే ఈ యాక్ట్
భూమికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా చేసి భూముల భద్రత కోసం మీ బిడ్డ జగన్ ఈ యాక్ట్ తీసుకు వచ్చారని జగన్ స్పష్టం చేశారు. ఏ సమస్య లేకుండా భూములకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వటమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం అని, చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదని జగన్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో ల్యాండ్ సర్వే.. భూములకు భద్రత కల్పిస్తుంది మేమే
బ్రిటిష్ కాలంలో జరిగిన సర్వే తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల సర్వే జరగలేదని, గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేసి రాష్ట్రవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన సర్వే చేయించి, రాళ్లను పాతించి, సర్వే చేసిన భూములను రికార్డులలో నిక్షిప్తం చేసి రైతుల భూములకు భద్రత కల్పిస్తున్నది మీ బిడ్డ జగన్ అని ఆయన పేర్కొన్నారు. మోసపూరిత మాటలు, అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+