జగన్ దిద్దుబాటు - వారికే నియోజకవర్గాల బాధ్యతలు..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. జిల్లాల వారీగా పార్టీలో నియామకాలు కొనసాగిస్తున్నారు. జిల్లా అధ్యక్షులతో పాటుగా నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ఖరారు చేస్తున్నారు. ఎన్నికల ముందు పలువురి నియోజకవర్గాలను మార్పు చేసారు. ఆ ప్రయోగం విఫలమైంది. దీంతో, ఇప్పుడు చర్యలు మొదలు పెట్టారు. నెల్లూరు జిల్లాలో నియోజకవర్గాల సమన్వయకర్తలను ఖరారు చేసారు.
వైసీపీలో నియామకాలు
వైసీపీ అధినేత జగన్ తాజాగా మూడు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. జిల్లా అధ్యక్షులను..నియోజకవర్గాల సమన్వయకర్తలను ఖరారు చేసారు. జిల్లాల్లో పార్టీ పరిస్థితి పై ఆరా తీసారు. ప్రభుత్వం పైన తక్కువ సమయంలోనే వ్యతిరేకత కనిపిస్తోందని పార్టీ నేతలు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రయత్నం జరగటం లేదన్నారు. ఇదే సమయంలో పార్టీ కేడర్ కు అండగా నిలవాలని నేతలకు జగన్ సూచించారు.

జిల్లా అధ్యక్షులు
ఇప్పటికే పలు జిల్లాలకు జగన్ అధ్యక్షులను నియమించారు. తాజాగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కాకాణి గోవర్ధనరెడ్డిని ఖరారు చేసారు. అదే విధంగా పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని జగన్ ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ముదునూరి ప్రసాదరాజు నియమితులయ్యారు. నెల్లూరు జిల్లా నేతలతో జగన్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా నిర్ణయించారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, (ఎమ్మెల్సీ)ని నియమించారు.
నెల్లూరులో మార్పులు
నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం విజయ్ కుమార్‌రెడ్డి ని ఎంపిక చేసారు. గతంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పని చేసి..ఆ తరువాత ఎన్నికల్లో నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసిన ఓడిన అనిల్ కుమార్ యాదవ్ ను జగన్ తాజాగా నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా నియమించారు. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన ఖలీల్ అహ్మద్ ను రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
-
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications