ఇక ప్రజల్లోనే ఉంటాను, అబద్దం చెప్పనందుకే - జగన్..!!
మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలకు కీలక సందేశం ఇచ్చారు. ప్రజలతోనే ఉండాలని..ఉందామని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇచ్చిన మోస పూరిత హామీల గురించి ప్రజలు త్వరలోనే అర్దం చేసుకుంటార ని జగన్ వ్యాఖ్యానించారు. తనను 16 నెలలు అక్రమంగా జైల్లో పెడితే ప్రజలు ఆదరించారని గుర్తు చేసారు. నాడు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి తమ వైపు తిప్పుకున్నారని..వారి పరిస్థితి ఏమైందని జగన్ ప్రశ్నించారు.
మనం పోటీ పెట్టం
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక పైన ఆ జిల్లా పార్టీ నేతలతో జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉందన్నారు. అక్కడ టీడీపీకి మెజార్టీ ఉంటే తాను పోటీ కూడా పెట్టనని చెప్పుకొచ్చారు. వైసీపీకి చెందిన వారిని టీడీపీ నేతలు ఫోన్లు చేసి ప్రలోభ పెడుతున్నారని చెప్పారు. రూ 5, రూ 10 లక్షలు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారని వివరించారు. తాను తన జీవితంలో విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయమే చేశానని చెప్పారు. అబద్దం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నామన్నారు.

అబద్దాలు చెప్పలేకనే
2019-24 వరకు అధికారంలో ఉన్న సమయంలో ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చామని చెప్పారు. మొన్న ఎన్నికల్లో ఓ 10 శాతం ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మారని వ్యాఖ్యానించారు. ఈ మోసపు ప్రచారంతో ఓ పది శాతం ప్రజలు మన దగ్గర నుంచి దూరమయ్యారని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రెండు నెలలు అయిందని..ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. రైతులకు ఇస్తానని చెప్పిన రూ 20 వేలు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. మోసం, అబద్దాలతో చేసిన పాలన ఎక్కువ రోజులు ఉండదని జగన్ వివరించారు.
ఆ 23 మంది ఏమయ్యారు
గతంలో మన పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను తీసుకున్నారని గుర్తు చేసారు. ఆ 23 మంది ఎమ్మెల్యేల్లో కేవలం ముగ్గురికి టిక్కెట్టిచ్చారన్నారు. వాళ్లకు ఒక్కొక్కరికి రూ.20 కోట్లు ఇస్తామని.. కేవలం అడ్వాన్స్ ఇచ్చారని చెప్పారు. దాంతో అటువైపు పోయిన వాళ్లందరూ మరలా వెనక్కి వచ్చేస్తామని తనకు ఫోన్ చేశారన్నారు. వాళ్ల రాజకీయ జీవితం సున్నా అయిపోయిందని వివరించారు. కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఇంకా గట్టిగా నిలబడాలన్నారు. ఐదేళ్లు కళ్లు మూసుకుంటే అయిపోతుంది. అందరూ బొత్స సత్యనారాయణకు మనస్ఫూర్తిగా సహకరించాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications