ట్విట్టర్‌లో చంద్రబాబుపై వైయస్ జగన్ విమర్శలు
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని విమర్శించడానికి వేదికగా ట్విట్టర్‌ని బాగానే ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ట్విట్టర్‌లో తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేసిన మోసం వల్ల మహిళలు అప్పుల్లో కూరుకుపోయి, కంటతడి పెడుతున్నారని మండిపడ్డారు.

‘‘ఉద్యోగాలిస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతిని చెల్లిస్తాం అని ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోకుండా చంద్రబాబు నిరుద్యోగ యువకులనూ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో చంద్రబాబు మెడలు వంచి ఆ హామీ అమలయ్యేలా చూడాల్సిన అవసరం ఉంది'' అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.
CBN broke poll promises of jobs & compensations for unemployed youth. Let us, together, compel him to yield and remit pic.twitter.com/akz6eQGWgU
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2015 











Click it and Unblock the Notifications