డిసెంబర్ 3న మళ్లీ హాజరవ్వాలి: కోర్టుకు జగన్, సబిత

ఆయా చార్జిషీట్లలో సమన్లు అందుకున్న ఇతర నిందితులు కూడా కోర్టుకు వచ్చారు. వీరిని డిసెంబర్ 3న తిరిగి హాజరు కావాలని సిబిఐ రెండో ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి పదోన్నతిపై హైకోర్టుకు వెళ్లడంతో ఏర్పడిన ఖాళీ ఇంకా భర్తీ చేయని నేపథ్యంలో, సిబిఐ రెండో కోర్టు న్యాయమూర్తి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.
వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం నాంపల్లి కోర్టులోనే ఉండటంతో, గగన్‌విహార్ కాంప్లెక్సులో ఉండే రెండో కోర్టు న్యాయమూర్తి ఇక్కడికి వచ్చారు. ఓఎంసి కేసులో జైల్లో ఉన్న నిందితులు శ్రీనివాస రెడ్డిని చంచల్‌గూడ జైలు నుంచి, గాలి జనార్దన్ రెడ్డి, అలీఖాన్‌ను బెంగళూరు జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి విచారించారు. వారికి డిసెంబర్ 3 వరకు రిమాండ్ పొడిగించారు.
అనివార్య కారణాలతో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు, ఆరోగ్యం బాగాలేక రాలేకపోతున్నానని ఓఎంసి కేసులో నిందితురాలు శ్రీలక్ష్మి పిటిషన్లు వేశారు. ఐఏఎస్‌లు మన్మోహన్‌సింగ్, శామ్యూల్ హాజరయ్యారు. ఎల్‌వి సుబ్రమణ్యం, వెంకట్రామి రెడ్డి గైర్హాజరయ్యారు. ఎమ్మార్ కేసులో నిందితులను నవంబర్ 22న తిరిగి హాజరు కావాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications