YS Jagan BIo Pic: వెండితెర పై జగన్ గా హీరో సిద్దం - ఎన్నికల వేళ యాత్ర 2..!!

YS Jagan BioPic: ఎన్నికల వేళ వెండితెర పై మరో బయోపిక్ సిద్దమవుతోంది. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత కధ ఆధారంగా తీసిన సినిమా యాత్ర. వైఎస్సార్ గా మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి నటించారు.

ఇప్పుడు 2024 ఎన్నికలు సమీపిస్తున్న వేళ యాత్ర -2 కోసం దర్శకుడు మ‌హి వి. రాఘ‌వ‌న్ ప్రణాళికలు సిద్దం చేస్తన్నారు. యాత్ర -2 వైఎస్ జగన్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా సాగనుంది. ఇప్పటి వరకు జగన్ పాత్ర లో నటించే హీరో గురించి పలువురి పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇప్పుడు ఖరారు చేసినట్లు సమాచారం.

YS Jagan BioPic Director Mahi V Raghav selected Tamil Hero Jiiva for YS Jagan role in Yatra 2

జగన్ బయోపిక్ కోసం: తెలుగు రాజకీయాలతో సినిమాలకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకుల బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. దర్శకుడు రాం గోపాల్ వర్మ తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు దగ్గరగా సినిమా లు తీసారు. ఎన్నికలే టార్గెట్‌గా సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్‌ రెండు భాగాలు కూడా విడుదలయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్‌కు క్రిష్ దర్శకత్వం వహించగా, ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించారు.

ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయంగా ఎదుర్కొన్న పరిస్థితుల పైన వ్యూహం సినిమా తీస్తున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ఇక, వైఎస్సార్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా యాత్ర సినిమా తీసిన దర్శకుడు మహి వి రాఘవన్ ఇప్పుడు జగన్ రాజకీయ ప్రయాణం ఆధారంగా యాత్ర 2 చిత్రీకరణకు సిద్దం అవుతున్నారు.

జగన్ పాత్రలో జీవా: ఇప్పుడు యాత్ర 2 వైఎస్ జ‌గ‌న్ పాత్ర‌లో త‌మిళ న‌టుడు జీవా ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్క్రిప్టు కూడా సిద్దం అయిందని తెలుస్తోంది. స్టోరీ మరి కొద్ది రోజుల్లోనే పూర్తి కానుంది. దీనికి సంబంధించి మరి కొద్ది రోజుల్లోనే అధికారంగా ప్రకటన చేయనున్నారు. యాత్ర సినిమాకు గత ఎన్నికల సమయంలో మంచి స్పందన వచ్చింది.

ఈ సారి జగన్ కేంద్రంగా తీసే సినిమా మరింత ప్రత్యేకతలతో సిద్దం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సమయం నుంచి ఓదార్పు యాత్ర, పాదయాత్ర మొదలు 2019 ఎన్నికల్లో సీఎం అయిన వరకు కీలక ఘట్టాలతో యాత్ర 2 సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కధ ఫైనల్ అవుతోందని సమాచారం.

YS Jagan BioPic Director Mahi V Raghav selected Tamil Hero Jiiva for YS Jagan role in Yatra 2

2024 ఎన్నికల వేళ: జగన్ పాత్రకు జీవా న్యాయం చేస్తాడని దర్శకుడు మహీ వి రాఘవ బలంగా నమ్ముతున్నారు. జగన్ బయోపిక్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌ జులై నుంచి మొదలవనున్నట్లు తెలిసింది. 'యాత్ర2' సినిమాలో ఎక్కువగా జగన్ పాదయాత్రను హైలైట్ చేయనున్నారు. ఇప్పటికే దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం పైన కసరత్తు వేగవంతం చేసినట్లుగా తెలుస్తోంది.

రంగం ఫేం జీవాకు లుక్ టెస్ట్ చేసి జగన్ పాత్రకు తగిన నటుడో.. కాదో.. తేల్చిన తరువాత ఈ సినిమాతో పాటుగా నటీ నటులకు సంబంధించి అధికారికంగా ప్రకటన చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం. దీంతో, ఇప్పుడు ఎన్నికల వేళ రాజకీయంగానే కాకుండా.. సినిమా పైన పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+