ప్రత్యేక హెలికాప్టర్‌లో జగన్: ఫ్యాన్ చూపిస్తూ..(పిక్చర్స్)

కర్నూలు: ఏ నాయకుడైతే పేదవాడి గుండె చప్పుడు వింటాడో.. అతనికే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలు, నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి రోడ్‌షోలు నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సువర్ణయుగం మళ్లీ వస్తుందని అన్నారు.

తనకు తన తండ్రి వైయస్ నుంచి వారసత్వంగా వచ్చింది కేవలం విశ్వనీయతే అని జగన్ అన్నారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సహకరించారని విమర్శించారు.

తొమ్మిదేళ్ల తన పాలనలో చేయలేని హామీలన్నీ ఇప్పుడు ఇస్తున్నారని చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. అధికారం కోసం సాధ్యం కానీ హామీలు ఇస్తూ.. అడ్డమైన గడ్డి కరుస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనను తలచుకుంటేనే భయమేస్తోందని అన్నారు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం అంటూ చంద్రబాబు కపట వాగ్ధానాలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.

జగన్ ప్రసంగం

జగన్ ప్రసంగం

ఏ నాయకుడైతే పేదవాడి గుండె చప్పుడు వింటాడో.. అతనికే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

భారీగా హాజరైన జనం

భారీగా హాజరైన జనం

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కర్నూలు, నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి రోడ్‌షోలు నిర్వహించారు.

జగన్ అభివాదం

జగన్ అభివాదం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే.. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సువర్ణయుగం మళ్లీ వస్తుందని జగన్ అన్నారు.

హెలికాప్టర్ నుంచి దిగివస్తూ..

హెలికాప్టర్ నుంచి దిగివస్తూ..

వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హెలికాప్టర్ దిగివస్తున్న జగన్.

జగన్ ఉపయోగించిన హెలికాప్టర్

జగన్ ఉపయోగించిన హెలికాప్టర్

తనకు తన తండ్రి వైయస్ నుంచి వారసత్వంగా వచ్చింది కేవలం విశ్వనీయతే అని జగన్ అన్నారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.

ఫ్యాన్ చూపిస్తూ..

ఫ్యాన్ చూపిస్తూ..

తొమ్మిదేళ్ల తన పాలనలో చేయలేని హామీలన్నీ ఇప్పుడు ఇస్తున్నారని చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు. అధికారం కోసం సాధ్యం కానీ హామీలు ఇస్తూ.. అడ్డమైన గడ్డి కరుస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+