టైం వచ్చినప్పుడు మేమూ కొడతాం, అందుకే గెలిచారు: నంద్యాలపై జగన్

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి ఓటమిపై ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం స్పందించారు. ఆయన హైదరాబాదులోని లోటస్ పాండ్‌లో మీడియాతో మాట్లాడారు.

నంద్యాల/హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి ఓటమిపై ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం స్పందించారు. ఆయన హైదరాబాదులోని లోటస్ పాండ్‌లో మీడియాతో మాట్లాడారు.

భయపెట్టి చంద్రబాబు గెలిచారు

భయపెట్టి చంద్రబాబు గెలిచారు

నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని జగన్ అన్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టారని ఆరోపించారు. నంద్యాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు. సాధారణ ఎన్నికలు కాదు కాబట్టి చంద్రబాబు గెలిచారన్నారు.

శిల్పా సోదరులకు హ్యాట్సాప్

శిల్పా సోదరులకు హ్యాట్సాప్

శిల్పా సోదరులకు హ్యాట్సాప్ అని జగన్ అన్నారు. వారు చాలా కష్టపడ్డారని కితాబిచ్చారు. శిల్పా చక్రపాణి రెడ్డి తన ఆరేళ్ల పదవీ కాలాన్ని త్యాగం చేశారని ప్రశంసించారు.

టైం వచ్చినప్పుడు మేమూ కొడతాం

టైం వచ్చినప్పుడు మేమూ కొడతాం

మాకు టైం వచ్చినప్పుడు మేమూ కొడతామని వైయస్ జగన్ అన్నారు. నంద్యాల గెలుపు చంద్రబాబు విజయం కాదన్నారు. ప్రజలు భయపడి టిడిపికి ఓట్లు వేశారని చెప్పారు. ప్రలోభాలకు గురి చేసి, భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకున్నారన్నారు.

వారికి థ్యాంక్స్

వారికి థ్యాంక్స్

ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురికాకుండా కష్టపడ్డ కార్యకర్తలందరికీ థ్యాంక్స్ అనిజగన్ అన్నారు. వైసిపి నైతిక విలువలకు కట్టుబడి ఉందని చెప్పారు. చంద్రబాబుది గెలుపు కాదని, దిగజారుడు రాజకీయమన్నారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లాక్కొని ఓట్లు వేయించుకున్నారన్నారు.

రూ.200 కోట్లు ఖర్చు చేశారు, బాబుకు సవాల్

రూ.200 కోట్లు ఖర్చు చేశారు, బాబుకు సవాల్

నంద్యాల ఉప ఎన్నికల కోసం చంద్రబాబు రూ.200 కోట్లు ఖర్చు చేశారని జగన్ ఆరోపణలు చేశారు. నంద్యాల ఉప ఎన్నికలు రెఫరెండం కాదని, ఫిరాయింపుకు పాల్పడిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలు నిర్వహించాలని బాబుకు సవాల్ విసిరారు. దానిని రిఫరెండంగా భావిస్తామన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకపోవడం బాబుకు అలవాటే అన్నారు. ఉప ఎన్నికలపై జగన్ పలుమార్లు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+