చంద్రబాబు ఆ ఒక్క నిర్ణయానికి జై కొట్టిన జగన్- అక్కడే అసలు లెక్క..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. స్థానిక ఎన్నికలకు పార్టీలు సిద్దం అవుతున్నాయి. ఈ ఎన్నికల కోసం కూటమి నేతలు కసరత్తు మొదలు పెట్టారు. అటు మాజీ సీఎం జగన్ సైతం పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏకగ్రీవం అయితే సహించేది లేదని..పోటీ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఎన్నికల కోసం చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయం పైన సానుకూలంగా స్పందించారు. కొత్త లెక్కలు విశ్లేషించారు.
ఏపీలో స్థానిక పోరుకు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. కూటమి- వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోరు కనిపిస్తోంది. అటు ఏకపక్షంగా విజయం సాధించాలని కూటమి పార్టీలు.. ఇటు ఏకగ్రీవం అయితే సహించేది లేదని జగన్ హెచ్చరికలతో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వం సర్ ఎన్నికల జాబితాకు ముందే ప్రస్తుత లిస్టు మేరకు మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. సెప్టెంబర్ తొలి వారంలోనే షెడ్యూల్ విడుదల కానుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇక.. ఈ ఎన్నికల కోసం అటు మంత్రులను సీఎం చంద్రబాబు సిద్దం చేస్తున్నారు. అటు మాజీ సీఎం జగన్ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్ లకు కీలక దిశా నిర్దేశం చేసారు. ఇదే సమయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తూనే.. ఇదే తమకు కలిసి వస్తుందంటూ విశ్లేషణలు చేసారు.

ఆ నిర్ణయం కలిసి వస్తుందనే లెక్కలతో జగన్
పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో ఏ వార్డులో అయినా పార్టీ అభ్యర్ధి బరిలో నిలవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని.. వారికి సీటు ఉండదని స్పష్టం చేసారు. ఇదే సమయం లో సీఎం చంద్రబాబు తీసుకున్న మేయర్, మున్సిపల్ ఛైర్మన్ల ప్రత్యక్ష ఎన్నిక విధానం పైనా జగన్ స్పందించారు. ఈ నిర్ణయం పైన సానుకూల వ్యాఖ్యలు చేసారు. ఇది కలిసి వచ్చే అంశంగా పేర్కొన్నారు. మేయర్ , మున్సిపల్ ఛైర్మన్ ను బలమైన అభ్యర్ధిని ఖరారు చేస్తే.. మిగిలిన వార్డుల్లో, డివిజన్లలో సానుకూల ఓటింగ్ జరుగుతుందని చెప్పుకొచ్చారు. ప్రధాన పదవికి బలమైన అభ్యర్ధిని ఎంపిక చేస్తే.. పోటీలో నిలిచే కార్పోరేటర్, కౌన్సిలర్ అభ్యర్ధులు అదనపు బలం గా మారుతారని చెప్పారు. దీనికి తగిన విధంగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని నిర్దేశించారు. కాగా, చంద్రబాబు ఈ నిర్ణయం వెనుక భారీ వ్యూహం ఉందనే విశ్లేషణల వేళ.. ఇప్పుడు ఈ ప్రత్యక్ష ఎన్నిక ఎవరికి కలిసి వస్తుందనే చర్చ ఆసక్తిగా మారుతోంది.













Click it and Unblock the Notifications