'సత్య నాదెళ్లను చంద్రబాబే సీఈవో చేశారు, కానీ మైక్రోసాఫ్ట్ షాకిచ్చింది'

ఏపీ అసెంబ్లీలో సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చురకలు అంటించారు. మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పేరుతో ఎద్దేవా చేశారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీలో సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చురకలు అంటించారు. మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పేరుతో ఎద్దేవా చేశారు.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా సుదీర్ఘ ప్రసంగం చేశారు. చంద్రబాబు పదేపదే అభివృద్ధి అంతా తన వల్లే జరిగిందంటారని అభిప్రాయపడ్డారు.

సత్య నాదెళ్ల నా వల్లె ఎదిగాడని అంటాడు..

సత్య నాదెళ్ల నా వల్లె ఎదిగాడని అంటాడు..

సత్య నాదెళ్ల తన వల్లే ఎదిగాడని చంద్రబాబు అంటారని, తన వల్లే సీఈవో అయ్యారని చెబుతుంటారని విమర్శించారు. అదే చంద్రబాబు కొద్ది రోజుల క్రితం... మైక్రోసాఫ్ట్ ఏపీకి వస్తుందని చెప్పారని, ఆయన చెప్పిన గంటల్లోనే తాము రావడం లేదని ఆ సంస్థ ప్రకటించిందని చెప్పారు.

ట్రంప్‌లా బాబుకు భయపడుతున్నారు

ట్రంప్‌లా బాబుకు భయపడుతున్నారు

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పేరు చెబితే భారతీయులు భయపడుతున్నారని, అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేరు చెబితే సంస్థలు, మన సంస్కృతి భయపడుతున్నాయన్నారు.

జగన్‌కు అడ్డు

జగన్‌కు అడ్డు

అసెంబ్లీలో జగన్ మాట్లాడుతుండగా మంత్రులు పలుమార్లు అడ్డుకున్నారు. దాదాపు ఏడుసార్లు అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మూడుసార్లు, మంత్రులు దేవినేని, పల్లెలు చెరోసారి అడ్డుకున్నారు. మరోవైపు, జగన్ మాట్లాడుతుండగా సభ మార్చి 13వ తేదీకి వాయిదా పడింది.

ఏపీలో అందులో దూసుకెళ్తోంది

ఏపీలో అందులో దూసుకెళ్తోంది

ఏపీ అవినీతిలో నెంబ‌ర్.1 అంటూ ప‌లు సంస్థ‌లు స‌ర్వేల్లో తేల్చాయ‌ని జగన్ అన్నారు. రాష్ట్రం దూసుకుపోతోందని చంద్ర‌బాబు చెప్పుకుంటోన్న గొప్ప‌ల‌కి అంద‌రూ భ‌య‌ప‌డిపోతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+