బాబుకు 57, వైయస్‌కు 96: జగన్, సాక్షి కాదు: టీడీపీ

YS Jagan compares Chandrababu with YSR
హైదరాబాద్: చంద్రబాబు పాలన కంటే వైయస్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని, బాబు 57 మార్కులు, వైయస్ 96 మార్కులు తెచ్చుకున్నారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో అన్నారు. బడ్జెట్ పైన చర్చ సందర్భంగా జగన్ మాట్లాడారు. వైయస్ తర్వాత వచ్చిన ప్రభుత్వాల పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. చంద్రబాబు పాలనలో జీడీపీ తగ్గి అప్పులు పెరిగాయని, ఆస్తులు బాగా తగ్గాయని, వైయస్ పాలనలో ప్రభుత్వ ఆస్తులు బాగా పెరిగాయన్నారు.

తొమ్మిదేళ్ల బాబు హయాంలో 21,994 కోట్ల రెవెన్యూ లోటు రాష్ట్రానికి వచ్చిందన్నారు. కానీ, వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి మిగులు బడ్జెట్ వచ్చిందన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబుకు కేవలం 57 మార్కులే వచ్చాయని, కానీ, 2004 నుంచి 2009 మధ్య పాలనలో ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి అమోఘంగా 96 మార్కులు తెచ్చుకున్నారన్నారు. 2009-2014 మధ్య రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం 68 మార్కులు తెచ్చుకుందన్నారు.

జగన్‌లా పారిపోం: యనమల

జగన్ పైన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సెటైర్లు విసిరారు. సభలో వృద్ధిరేటు గురించి మాట్లాడుతున్న జగన్, అవినీతి రేటు, దోపిడీ రేటు గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. జగన్ చెప్పేవన్నీ అసత్యపు లెక్కలన్నారు. చంద్రబాబు, వైయస్ పాలనల మధ్య వ్యత్యాసాలపై మాట్లాడటానికి సొంత లెక్కలు వద్దన్నారు. తాము జగన్ మాదిరి సభ నుంచి పారిపోయే వారం కాదని, జగన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామన్నారు.

అచ్చెన్నాయుడు కౌంటర్

శ్వేతపత్రం అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పేదని, శ్వేతపత్రం అంటే సాక్షి కాదని మంత్రి అచ్చెన్నాయుడు చురకలు అంటించారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించింది వైయస్సే అన్నారు. మూడు నెలల్లో విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు.

తప్పుడు లెక్కలు: కాల్వ

తప్పుడు లెక్కలతో జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని కాల్వ శ్రీనివాసులు అన్నారు. 2004-2014 వరకు ఎంతో అభివృద్ధి చెందిందని జగన్ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని, నిజానికి అభివృద్ధి జరిగింది జగన్ ఆస్తుల పెంపులోనే అన్నారు.

భూమా, కోడెల మధ్య ఆసక్తికర చర్చ

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభంకాగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగి రెడ్డి, స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. స్పీకర్‌ కోడెల అంతకుముందు నవ్వుతూ పలకరించే వారని స్పీకర్‌ అయ్యాక కనీసం తమవైపు చూసి నవ్వడం లేదని ఎమ్మెల్యే అన్నారు. దీనిపై స్పీకర్‌ మాట్లాడుతూ సభ సజావుగా సాగడంలేదనే బాధ తప్ప మరో ఉద్దేశం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+