ఉత్తరాఖండ్-మోడీపై జగన్ నమ్మకం: బిజెపి బాబు చేతికి చిక్కిందా?

విజయవాడ/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్రాన్ని నమ్మడంలో అర్థం లేదా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. సేవ్ డెమోక్రసీ పేరుతో జగన్ ఢిల్లీలో చక్కర్లు కొట్టారు. ఆయన ఏపీ సీఎం చంద్రబాబుపై కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేశారు.

అయితే, కేంద్రాన్ని, ప్రధాని మోడీని జగన్ నమ్మడం ఆశ్చర్యకరమేననే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో జరిగిన సంఘటనలను పలువురు ఉదహరిస్తున్నారు. ఏపీలో చంద్రబాబు ఏం చేస్తున్నారో.. ఆ రెండు రాష్ట్రాలలోను బిజెపి అదే చేస్తోందని అంటున్నారు.

ఒక్క తేడా మాత్రమే ఉందని, ఇక్కడ చంద్రబాబు అధికారంలో ఉండి ఎమ్మెల్యేలకు గాలం వేస్తుంటే, ఆ రాష్ట్రాలలో అధికారం కోసం బిజెపి ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కున్నారని అంటున్నారు. ఏపీలో ఏం జరిగిందో.. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌లలో బిజెపి అదే చేసిందని, అలాంటప్పుడు జగన్ నమ్మడం ఏమిటంటున్నారు.

ys jagan

మోడీని చంద్రబాబు ప్రశ్నించేనా?

ఏపీలో టిడిపి, బిజెపి ప్రభుత్వాలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రతిపాదనల పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉండవనే చెప్పవచ్చునని అంటున్నారు. అంతేకాకుండా, ఫిరాయింపులను బిజెపి ప్రశ్నిస్తే... చంద్రబాబు లేదా టిడిపి ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ అంశాలను ప్రస్తావించలేరని చెప్పలేమంటున్నారు.

అంతేకాకుండా, విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను టిడిపి గట్టిగా డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే కేంద్రం ఏం చేయడం లేదని చెబుతున్నారు. జగన్ ఫిర్యాదును పట్టించుకుంటే.. టిడిపి నేతలు మరింత రెచ్చిపోయే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ, రైల్వే జోన్ వంటి ఎన్నో అంశాలలో కేంద్రాన్ని టిడిపి దోషిగా చూపే ప్రయత్నాలు చేయవచ్చు. ఏ రకంగా చూసినా బిజెపి జగన్‌కు సానుకూలంగా స్పందించే అవకాశాలు తక్కువే అంటున్నారు. అది కాకపోయినప్పటికీ టిడిపి మిత్రపక్షం కాబట్టి మిన్నకుండే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు. మరోవైపు, జగన్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వడంపై టిడిపి నేతలు బిజెపిపై భగ్గుమంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+