పవన్ కళ్యాణ్ తర్వాత జగన్: అతి సమీపంలో ఉంటూ తలొంచలేదు, అమోఘం
ఫిడెల్ క్యాస్ట్రో మృతి పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. శనివారం జనసేన అధినేత పవన్ కూడా ట్వీట్ ద్వారా సంఘీభావం తెలిపారు.
విజయవాడ: ఫిడెల్ క్యాస్ట్రో మృతి పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అమెరికాకు అతి సమీపంగా ఉంటూ, అగ్రరాజ్యానికి కించిత్ తల వంచని ధీశాలి క్యాస్ట్రో అని ప్రశంసించారు.
క్యూబా చిన్న దేశమే అయినప్పటికీ ఎవరికీ గులాం కాకుండా ప్రపంచంలో నిలబడిన తీరు అమోఘమన్నారు. తన పట్టుదల, నిబద్ధతతో క్యూబాను, క్యూబా దేశీయులను నడిపించిన మహానేత ఫిడెల్ క్యాస్ట్రో అన్నారు. 50 ఏళ్ల పాటు క్యాస్ట్రో పాలనలో క్యూబా పలు విజయాలు సాధించిందన్నారు. అద్భుతమైన పోరాట స్ఫూర్తి, మొక్కవోని నిబద్ధతతో క్యూబాను నడిపించిన మహానేత క్యాస్ట్రో అన్నారు.
కాగా, శనివారం నాడు పవన్ కళ్యాణ్ కూడా ఫిడెల్ క్యాస్ట్రో మృతికి సంతాపం తెలిపారు. చే గువేరా లాంటి విప్లవ వీరులను తయారు చేసిన విప్లవ నేత ఫిడెల్ క్యాస్ట్రో మృతి పట్ల పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన క్యాస్ట్రోకు జనసేన పార్టీ సెల్యూట్ చేస్తోందన్నారు. ఆయన నాయకత్వంలో క్యూబా అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు అడుగులు వేసిందన్నారు.

విప్లవానికి మారుపేరు: మధు
విప్లవానికి మారు పేరు కాస్ట్రో అని సీపీఎం నేత పి మధు అన్నారు. శనివారం రాత్రి రాఘవయ్య పార్కు ఎదురుగా ఉన్న ఎంబీ విజ్ఞాన కేంద్రంలో కాస్ట్రో సంతాప సభ జరిగింది. ముందుగా ఆయనకు నివాళులర్పిస్తూ విజ్ఞాన కేంద్రం వెలుపల కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం కాస్ట్రో చిత్రపటానికి పూలమాల వేసి పలువురు నేతలు నివాళులర్పించారు. రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం మధు మాట్లాడారు. కాస్ట్రోమృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటన్నారు. క్యూబా చిన్న దేశమైనప్పటికీ సామ్రాజ్యవాదాన్ని దీటుగా ఎదుర్కొన్నారన్నారు.
-
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications