ఆ త్యాగానికి వెలకట్టలేం- చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ కృతజ్ఞతలు

YS Jagan: జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన భారత ఆర్మీ జవాన్‌ అగ్నివీర్‌ మురళీ నాయక్‌ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

ఈ మధ్యాహ్నం బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో నేరుగా శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా చేరుకున్నారు వైఎస్‌ జగన్. అనంతరం అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్ నాయకులతో కలిసి అమర జవాన్‌ మురళీ నాయక్‌ ఇంటికి వెళ్లారు. ఆయన తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్‌నాయక్‌ను పరామర్శించారు. మురళీ నాయక్ చిత్రపటానికి నివాళి అర్పించారు.

YS Jagan console to Slain Indian Army soldier Murali Naik and announced Rs 25 Lakh Compensation

జగన్ వెంట మాజీ మంత్రి మాజీ మంత్రులు ఉష శ్రీచరణ్, శైలజానాథ్, లోక్‌సభ మాజీ సభ్యుడు గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సహా పలువురు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.

జగన్‌ను చూసిన ఆ వీర జవాన్‌ తల్లిదండ్రులు దుఖాన్ని ఆపుకోలేకపోయారు. కన్నీరుమున్నీరు అయ్యారు. జగన్ వారిని ఓదార్చారు. ధైర్యం చెప్పారు. పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని చెప్పారు. దేశం కోసం ప్రాణలను అర్పించిన వీర జవాన్‌ మురళీనాయక్‌ త్యాగానికి వెల కట్టలేమని పేర్కొన్నారు. పార్టీ తరపున 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. దేశం కోసం పోరాడుతూ తన ప్రాణ త్యాగం చేశారని, లక్షలాదిమందికి స్ఫూర్తినిచ్చారని అన్నారు. తాను కన్నుమూస్తూ ఎంతోమంది అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రక్షణగా ఇచ్చారని చెప్పారు. దేశం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా సమర్పించాడని పేర్కొన్నారు.

ఆయన చేసిన త్యాగానికి రాష్ట్ర ప్రజలంతా ఎప్పటికీ రుణపడి ఉంటారని జగన్ అన్నారు. దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇచ్చే సంప్రదాయానికి గతంలో తమ ప్రభుత్వం మొదలుపెట్టిందని గుర్తు చేశారు. దాన్ని కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం కూడా మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల రూపాయల సహాయం ఇవ్వాలని నిర్ణయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ తరపున మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని జగన్ చెప్పారు. వైఎస్సార్‌సీపీ నుంచి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని పేర్కొన్నారు. పార్టీ నుంచి ఈ కుటుంబానికి అందరం తోడుగా ఉంటామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+