బెంగళూరులో కాంగ్రెస్ నేతలతో వైఎస్ జగన్ విందు భేటీ ? కారణమిదేనా..!

ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత ఎన్డీఏకు క్రమంగా దూరమవుతూ ఇండియా కూటమికి దగ్గరవుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు మరో అడుగు వేశారు. ప్రస్తుతం బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్న ఆయన.. తాజాగా శనివారం కర్నాటక కాంగ్రెస్ నేతలతో భేటీ అయినట్లు తెలుస్తోంది. సదరు నేతలతో తన బెంగళూరు నివాసంలో జగన్ విందు ఇచ్చినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. ఇందులో ఉద్దేశం ఏంటని జగన్ ను ఆయన ప్రశ్నించారు.

శనివారం రాత్రి బెంగళూరు ఇంట్లో కర్నాటక కాంగ్రెస్ నేతలకు వైఎస్ జగన్ ఇచ్చిన విందు ఇండియా కూటమిలో చేరే ప్రయత్నంగా వర్ల రామయ్య అభివర్ణించారు. మీకు ధైర్యం ఉంటే కాంగ్రెస్ నాయకులతో ఏమి మాట్లాడారో చెప్పండి..జగన్ ''ఇండియా కూటమి''లో చేరడానికే బెంగుళూరులో కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారంటూ వర్ల వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇండియా కూటమికి దగ్గరవుతున్న జగన్ కాంగ్రెస్ ను ప్రసన్నం చేసుకునేందుకే ఈ భేటీ నిర్వహించారని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

ys jagan dinner meet with Karnataka congress leaders Says tdp leader varla Ramaiah

గతంలో ఏపీలో ఎన్డీఏ సర్కార్ తమ పార్టీ నేతల్ని, కార్యకర్తల్ని టార్గెట్ చేస్తోందంటూ ఢిల్లీలో వైఎస్ జగన్ నిర్వహించిన ధర్నాకు ఇండియా కూటమిలో 8 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో అఖిలేష్ యాదవ్ సహా పలువురు జాతీయ స్థాయి నేతలు ఉన్నారు. అయితే అప్పట్లో కాంగ్రెస్ మాత్రం ఈ ధర్నాకు దూరంగా ఉండిపోయింది. దీనిపై ఆ తర్వాత ఓసారి ప్రెస్ మీట్లో జగన్ అభ్యంతరం తెలిపారు కూడా. దీంతో కాంగ్రెస్ ను సైతం ప్రసన్నం చేసుకునేందుకు జగన్ బెంగళూరులో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వైసీపీ నేతలు మాత్రం నోరు మెదపడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+