వైసీపీ సీనియర్ల బాధ్యతల్లో మార్పులు..!!
వైసీపీలో సమూళ ప్రక్షాళన దిశగా నిర్ణయాలు జరగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ జిల్లాల వారీగా అవసరమైన మార్పుల పైన కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రా స్థాయిలోనూ ముఖ్య నేతల బాధ్యతలను మార్పు చేయాలని నిర్ణయించారు. పార్టీ వ్యవహారాలను తానే స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. అధికార ప్రతినిధులు...జిల్లా నాయకత్వాలను పూర్తిగా పటిష్టం చేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించి అధికారికంగా నిర్ణయం వెల్లడించనున్నారు.
కసరత్తు
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితం అయింది. ప్రజలతో పాటుగా పార్టీ కేడర్ తో జగన్ దూరంగా ఉండటమే ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా చెబుతున్నారు. జగన్ కోటరీలో ఉన్న ముఖ్య నేతల వ్యవహార శైలి సైతం ప్రధాన కారణంగా విశ్లేషిస్తున్నారు. సజ్జల, ధనుజంయ్ రెడ్డి లాంటి వారి తీరు పైన సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. దీంతో..ఫలితాల తరువాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. సజ్జల మీడియా సమావేశాలు..కీలక నిర్ణయాలకు దూరంగా ఉంటున్నారు.

నివేదికలు
ఇప్పుడు పార్టీ అనుబంధ సంఘాలతో పాటుగా మీడియా వ్యవహారాలను తిరిగి విజయ సాయిరెడ్డికి అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జిల్లాల్లో ఏరి కోరి ఎంపిక చేసిన అధ్యక్షులు ప్రస్తుతం పలు కార్పోరేషన్లు..మున్సిపాల్టీలను టీడీపీ కైవసం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నా...సమర్ధవంతంగా వ్యవహరించటం లేదనే అభిప్రాయం ఉంది. ఎన్నికల సమయం నుంచి కొందరు జిల్లా అధ్యక్షుల తీరు పైన ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో..ఇప్పుడు అయిదు జిల్లాలు మినమా మిగిలిన జిల్లాల అధ్యక్షుల మార్పు ఖాయమైందని సమాచారం.
నిర్ణయాలు
జిల్లాల్లో పార్టీ నేతలను ముందుగా యాక్టివ్ చేయాలని జగన్ నిర్ణయించారు. ఆ తరువాత జిల్లాల పర్యటనలకు జగన్ సిద్దం అవుతున్నారు. ఇక నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ఇంఛార్జ్ ల ను మార్పు చేసారు. ఇప్పుడు నియోజవర్గాల వారీగానూ జగన్ పరిస్థితిని ఆరా తీస్తున్నారు. కడప జిల్లా పరిషత్ స్వాధీనం కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో...జిల్లాకు చెందిన పార్టీ జెడ్పీటీసీలతో ఈ నెల 21 న జగన్ సమావేశం ఏర్పాటు చేసారు. పార్టీ కార్యాలయంలో జగన్ కేడర్ కు అందుబాటులో ఉండటంతో పాటుగా యాక్టివ్ గా ఉండే నేతలకు కీలక బాధ్యతలు అప్పగింతకు సిద్దమయ్యారు.












Click it and Unblock the Notifications