జగన్ విడుదల: ఫ్యాన్స్ జోష్, టీ సెగ కూడా (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చంచల్‌గుడా జైలు నుంచి విడుదలైనప్పుడు పార్టీ కార్యకర్తలతో పాటు అభిమానుల సందడి చోటు చేసుకుంది. అభిమానుల హోరు మధ్య వైయస్ జగన్ అభివాదం చేస్తూ ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో తెలంగాణవాదులు ఆయన ఎదుట నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నించారు.
వైయస్ జగన్ బెయిల్‌పై మంగళవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు పెద్ద యెత్తున స్వాగతం చెప్పారు. జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఆయనతో కరచాలనం చేయడానికి ప్రయత్నించారు. ఆయన వాహనం వెంట నడిచారు.
కాగా, తెలంగాణవాదులు తెలంగాణ ప్లకార్డు ప్రదర్సిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. జగన్ విడుదల సమైక్యాంధ్ర ఉద్యమానికి ఊపు వస్తుందని భావిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం ఆయన పోరాటం చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారు.

తెలంగాణవాది నిరసన
పార్టీ సమైక్యవాదానికి నిరసనగా తెలంగాణవాదులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చంచల్‌గుడా జైలు నుంచి విడుదలైనప్పుడు నిరనస వ్యక్తం చేయడానికి ప్రయత్నించారు. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తెలంగాణ స్లోగన్..
తెలంగాణ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నించిన తెలంగాణవాదిని పోలీసులు తీసుకుని వెళ్తున్న దృశ్యం. భద్రతాధికారులు అతన్ని పక్కకు తప్పించారు.

ప్రత్యేక ఏర్పాట్లు..
చంచల్‌గుడా జైలు వద్ద జగన్ విడుదల సందర్బంగా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. ముళ్ల కంచె ద్వారా ఓ పాపను ఇలా దాటించారు.

సందడే సందడి..
వైయస్ జగన్ విడుదల కోసం ప్రజలు ఇలా నిరీక్షించారు. జైలు వద్ద కోలాహలం చోటు చేసుకుంది. జగన్ ఎప్పుడు బయటకు వస్తాడా అంటూ ఎదురు చూశారు.

జనం మధ్య జగన్..
జైలు నుంచి బయటకు వచ్చిన జగన్‌ను అభిమానులు, పార్టీ కార్యకర్తలు చుట్టుముట్టారు. తనను చూడడానికి వచ్చిన వారి వైపు చూస్తూ జగన్ ఇలా...

ప్రజలకు అభివాదం చేస్తూ...
చంచల్‌గుడా జైలు నుంచి బయటకు వచ్చిన వైయస్ జగన్ తన కోసం వచ్చినవారికి అభివాదం చేస్తూ ఇలా కనిపించారు. జైలు వద్ద పెద్ద యెత్తున సందడి నెలకొంది.

కెమెరాలో బంధిస్తూ..
తన కోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కెమెరాలో బంధిస్తున్న వైనం...

జనమే జనం...
వైయస్ జగన్ కోసం వచ్చిన ప్రజలను కట్టడి చేయడం భద్రతాధికారులకు, పోలీసులకు కష్టమే అయింది. పెద్ద యెత్తున ప్రజలు చంచల్‌గుడా జైలు వద్దకు చేరుకున్న ప్రజలు ఆయన చెంతకు వచ్చి కరచాలనం చేయడానికి ప్రయత్నించారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications