జగన్‌ను అంటే చంపేస్తాం, పిల్లోడివి: పవన్‌కు అభిమాని హెచ్చరిక, హైపర్ ఆదితో పోలిక
Recommended Video

గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అంటే చంపేస్తానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు హెచ్చరికలు వచ్చాయి. ఆ హెచ్చరికలు చేసింది జగన్ అభిమాని. ఇది కలకలం రేపింది.
పవన్ కళ్యాణ్‌ను హెచ్చరించిన జగన్ అభిమానిని పోలీసులు అరెస్టు చేశారు. అతని పేరు వెంకట రెడ్డి. అతను రెండు హత్య కేసుల్లో నిందితుడు అని ప్రచారం సాగుతోంది. వెంకట రెడ్డి తన సెల్ఫీ వీడియోలో పవన్ కళ్యాణ్‌పై తీవ్రంగా విరుచుకుపడుతూ హెచ్చరికలు జారీ చేశాడు.

అసభ్య పదజాలం
అందులో అసభ్య పదజాలాలు వాడాడు. జగన్‌తో పోలీస్తే పవన్ కళ్యాణ్ పిల్లవాడు అని, కోన్ కిస్కా గొట్టంగాడు అని విమర్శించాడు. జగనన్న సైన్యం ఉందని, ఆయనను ఏమైనా అంటే చంపడానికి, చావడానికి అయినా సిద్ధమేనని హెచ్చరించారు.

హైపర్ ఆదితో పోలిక
పవన్ కళ్యాణ్ జబర్దస్త్ కార్యక్రమంలోని హైపర్ ఆదితో సమానమని, ప్రజలకు జగన్ దేవుడిలాంటి వాడని చెప్పాడు. జగన్ ఫోటోలను ఇంట్లో పెట్టుకొని పూజించే వారు ఉన్నారని చెప్పాడు. అంతేకాదు, నాది గుంటూరు అని, చేతనైతే పవన్ సైన్యం వచ్చి ఏం చేసుకుంటారో చేసుకోవాలని సవాల్ చేశాడు.

సోషల్ మీడియాలో హల్‌చల్
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ వ్యాఖ్యలపై గుంటూరు నల్లపాడు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. బుధవారం వెంకట రెడ్డిని అరెస్టు చేశారు. అతను రెండు హత్య కేసుల్లో నిందితుడు అని పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. అతను ఓ హీరో, ఓ దర్శకుడి ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఉన్నారని తెలుస్తోంది.

రౌడీషీట్ తెరిచే ఛాన్స్
వెంకట రెడ్డిపై పోలీసులు రౌడీషీట్ తెరిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సోషల్ మీడియాలో ఇలా ఎవరైనా ఇష్టారీతిన మాట్లాడితే, అసభ్యకర పదజాలంవాడితో చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications