'ఇదీ వైసీపీ అధినేత జగన్ ఆలోచన, ప్రజల గురించి మాత్రం కాదు'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసుల నుంచి ఎలా బయటపడాలో ఆలోచన చేస్తున్నారని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు.

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసుల నుంచి ఎలా బయటపడాలో ఆలోచన చేస్తున్నారని మంత్రి నారాయణ గురువారం నాడు ఎద్దేవా చేశారు. ఆయన ఆలోచన ప్రజల పైన ఏమాత్రం కాదన్నారు.

అక్కడే డౌట్!: బాబుపై చిరంజీవి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారా?

కాగా, గన్నవరం విమానాశ్రయంలో రన్ వే విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు భూమిపూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, కొల్లు రవీంద్ర, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

YS Jagan in fear of cases, says Telugudesam Party leader.

విమానయాన సదస్సు

గన్నవరం విమానాశ్రయాన్ని అమరావతి విమానాశ్రయంగా పేరు మార్చేందుకు సుముఖంగా ఉన్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు గురువారం తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో విమానయాన సదస్సును కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడారు. విమానయాన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, ఈ రంగానికి సంస్థలన్నీ కలిసికట్టుగా ముందుకు రావాలన్నారు. ఈ సదస్సు ద్వారా వచ్చే మంచి ఆలోచనలను, సూచలను అమలు చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు.

వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ప్రాంతాలను విమానయానం ద్వారా అనుసంధానించినప్పుడే ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్నారు. తమ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టిందన్నారు.

ఏపీకి వరంగా ఉన్న తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను అనుసంధానించాలని సూచించారు. కోస్తా ప్రాంతానికి చెందిన వారు చాలామంది విదేశాల్లో ఉన్నారని.. అందుకే ఇక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసులకు డిమాండ్‌ ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+